
📌 Key Points
- దేశవ్యాప్తంగా ‘ధురందర్’ సినిమా సంచలన విజయం సాధించింది.
- రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా వంటి నటులతో ఆదిత్యధర్ ఈ సినిమాను తెరకెక్కించారు.
- అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
- కేటీఆర్ ఈ పాటను షేర్ చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
ఇటీవల ‘ధురందర్’ సినిమా దేశవ్యాప్తంగా విజయవంతమైంది. ఈ మూవీలోని అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా, కేటీఆర్ ఈ పాటను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఈ పాటను షేర్ చేయడంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ధురందర్ సినిమా సంచలనం
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, దురంధర్ సినిమా గురించి చెబుతున్నారు. ఎవరు ఊహించని కథాంశంతో వచ్చిన ఈ దురంధర్ మూవీ, ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. రణ్‌వీర్ సింగ్, సంజయ్, మాధవన్, అక్షయ్ కన్నా ప్రత్యేక పాత్రలో వచ్చిన ఈ సినిమాను ఆదిత్యధర్ తెరకెక్కించారు. డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో ఈ కథాంశం తెరకెక్కించారు. అయితే, దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ పాట మారుమోగుతోంది. అయితే తాజాగా ఇదే పాటను గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు షేర్ చేసి షాక్ ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి ఈ పాటను షేర్ చేశారో తెలియదు కానీ, ఈ పాట మళ్లీ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ పాటను కేటీఆర్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఈ పాటను షేర్ చేయడం పట్ల కూడా కొత్త చర్చ మొదలైంది. క్లిక్
కేటీఆర్ షేర్ చేసిన వైరల్ సాంగ్
రాజకీయ వర్గాల్లో చర్చ
కేటీఆర్ ‘ధురందర్’ సాంగ్ షేర్ చేయడం కేవలం ఒక సినీ అప్డేట్ కాకుండా, రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆయన జోష్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేది వేచి చూడాలి.


