|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చివరి నిమిషంలో బిగ్ షాకిచ్చిన ‘కుబేర’ మూవీ టీమ్.. వాయిదా వేస్తున్నామంటూ ట్వీట్

Published: 13-06-2025, 7:05 AM
చివరి నిమిషంలో బిగ్ షాకిచ్చిన ‘కుబేర’ మూవీ టీమ్.. వాయిదా వేస్తున్నామంటూ ట్వీట్

ధనుష్, రష్మిక మందన్న, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమా జూన్ 20న విడుదల కావాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా…

Key Points

1

ధనుష్, రష్మిక, నాగార్జున నటించిన కుబేర సినిమా రిలీజ్ వాయిదా

2

ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రీ-రిలీజ్ వేడుక రద్దు

4

ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు

కుబేర సినిమా రిలీజ్ వాయిదా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే దీనికి శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అయితే ‘కుబేర’(kubera) మూవీ జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే అప్డేట్స్‌ను కూడా రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని తమ ‘కుబేర’ మూవీపై పడేలా చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో జూన్ 13న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈక్రమంలోనే.. ఆహ్మదాబాద్ ఫ్లైట్ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకేఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ‘కుబేర’ ప్రీ-రిలీజ్ వేడుకను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రభావం

అభిమానుల నిరాశ

ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ‘కుబేర’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నారు. అభిమానులు కొత్త తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.