|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kubera Movie Tickets: ఏపీలో ‘కుబేర’ మూవీ టికెట్ ధరలు పెంపు.. మరి తెలంగాణలో..?

Published: 19-06-2025, 4:50 AM
Kubera Movie Tickets: ఏపీలో 'కుబేర' మూవీ టికెట్ ధరలు పెంపు.. మరి తెలంగాణలో..?

ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన కుబేర సినిమా జూన్ 20న విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరలను పెంచడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణలో మాత్రం ధరలలో మార్పు లేదు.

Key Points

1

కుబేర సినిమా టికెట్ ధరలు ఏపీలో పెంపు

2

సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లలో రూ.75 పెంపు

4

తెలంగాణలో టికెట్ ధరల్లో మార్పు లేదు

ఏపీలో కుబేర సినిమా టికెట్ ధరల పెంపు

కోలీవుడ్ స్టార్ ధనుష్(Dhanush) అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర'(Kubera). ఇక దీనికి మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే దీనిని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లివిటెడ్‌తో కలిసి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

కాగా ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా కుబేర సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా సింగిల్ స్క్రీన్స్, మల్టీ ప్లెక్స్‌ల్లో టికెట్ ధరను రూ.75(జీఎస్టీతో) పెంచుకునేలా వీలు కల్పించారు. అయితే మూవీ రిలీజ్ అయిన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. కాగా తెలంగాణలో మాత్రం టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయమై చిత్ర బృదం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం.

తెలంగాణలో టికెట్ ధరలపై ప్రభావం

సినిమా విడుదల తేదీ మరియు ధరల అమలు కాలం

చివరగా, కుబేర సినిమా టికెట్ ధరల పెంపు ఏపీకి మాత్రమే పరిమితం అయింది. తెలంగాణ ప్రేక్షకులు ఇప్పటికే ఉన్న ధరలతోనే సినిమా చూడవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.