|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నెల రోజుల్లోపే.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Published: 11-07-2025, 3:48 AM
కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నెల రోజుల్లోపే.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది. ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో అద్భుతమైన విజయం సాధించింది.

Key Points

1

కుబేర సినిమా జులై 18 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.

2

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల.

4

ధనుష్, నాగార్జున, రష్మిక నటనకు ప్రశంసలు.

అమెజాన్ ప్రైమ్ లో కుబేర

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఆ ఓటీటీ శుక్రవారం (జులై 11) వెల్లడించింది. జులై 18 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుంది.

తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కుబేర ఓటీటీ రిలీజ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమాను వచ్చే శుక్రవారం అంటే జులై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వెల్లడించింది.

“ఓ సింపుల్ మనిషి. కానీ అతని అంత సింపుల్ కాని రిడెంప్షన్ జర్నీ. కుబేర ప్రైమ్ లో జులై 18 నుంచి” అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో ఈ విషయం వెల్లడించింది. మొత్తం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కుబేర ఓటీటీలోకి రానుంది.

రిలీజ్ తేదీ & భాషలు

గత నెల 20న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. సినిమా రాగానే హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ ఆన్‌లైన్ లో లీకవడంతో అనుకున్నదాని కంటే ముందే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఊహించినట్లే జులై 18 నుంచే మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

ధనుష్ , నాగార్జున, రష్మిక మందన్నాలాంటి క్రేజీ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా కుబేర. జిమ్ సర్బ్ విలన్ పాత్ర పోషించాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మూడు గంటల 10 నిమిషాల నిడివితో వచ్చిన మూవీ ఇది.

బాక్స్ ఆఫీస్ విజయం

ఓ ఆయిల్ గ్యాస్ నిధిని దక్కించుకోవడానికి విలన్ చేసే ప్రయత్నం, దానికి ఓ మాజీ సీబీఐ ఆఫీసర్ సాయం, బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లు, లంచంగా ప్రభుత్వ పెద్దలకు రూ. లక్ష కోట్లు.. ఇలా సాగిపోయింది కుబేర మూవీ. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా ధనుష్ నటనకు అందరూ ఫిదా అయ్యారు.

ఇందులో ఓ బిచ్చగాడి పాత్రలో ఈ తమిళ స్టార్ హీరో నటన అద్భుతమనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల మార్క్ మూవీగా కుబేర నిలిచింది. థియేటర్లలో ఒకవేళ ఈ సినిమా చూసి ఉండకపోతే జులై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తున్న ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు.

కుబేర సినిమా థియేటర్లలో విజయవంతమై ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ లో చూడటం మర్చిపోకండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.