
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందాన నటించిన కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ విజయంతో ఆమెకు తమిళంలో డిమాండ్ పెరిగింది. శేఖర్ కమ్ముల కూడా ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
Key Points
రష్మిక కుబేర సినిమాతో మరో విజయం సాధించింది.
తమిళంలో ఆమెకు బలమైన డిమాండ్ పెరిగింది.
శేఖర్ కమ్ముల రష్మికకు బంపర్ ఆఫర్ ఇచ్చారని వార్తలు.
శేఖర్ కమ్ముల తదుపరి చిత్రంలో రష్మిక నటించే అవకాశం ఉంది.
కుబేర సినిమా విజయం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో ( Chalo), గీత గోవిందం ( Geetha Govindam) లాంటి సినిమాలతో… టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రష్మిక. ఆ తర్వాత ఆమె కెరీర్ మొత్తం మారిపోయింది. ఇక ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఛాన్స్ కొట్టేసి… నేషనల్ క్రష్ గా మారింది.
రష్మికకు పెరిగిన డిమాండ్
ఇక లేటెస్ట్ గా… కుబేర (Kuberaa) సినిమాతో మరో సక్సెస్ అందుకుంది హీరోయిన్ రష్మిక. ఈ కుబేర సినిమాలో అక్కినేని నాగార్జున, హీరో ధనుష్, రష్మిక కీలక పాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమాకు శేఖర్ కమ్ముల ( Shekar kammula) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో… హీరోయిన్ రష్మిక ఖాతాలో మరో హిట్ పడినట్లే అయింది. అయితే కుబేరతో సక్సెస్ అందుకున్న రష్మిక మందానకు… తమిళంలో మంచి డిమాండ్ పెరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
శేఖర్ కమ్ముల బంపర్ ఆఫర్
ఆమెతో సినిమాలు చేసేందుకు తమిళ దర్శకులు సిద్ధమవుతున్నారట. కుబేర సినిమా చూసిన తర్వాత.. ఆమె డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారట దర్శకులు. అలాగే.. శేఖర్ కమ్ముల కూడా… బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. కుబేర తర్వాత మరో సినిమాకు శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా విరాట పర్వం తరహాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలో రష్మిక తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట శేఖర్ కమ్ముల. దీంతో అతని దర్శకత్వంలో రష్మిక సినిమా ఫిక్స్ అయితే మరో హిట్ పడినట్లే అని అంటున్నారు.
కుబేర సినిమా విజయం తో రష్మిక కెరీర్ కొత్త ఎత్తులకు చేరుకుంటోంది. తమిళంలోనూ, తెలుగులోనూ ఆమెకు భారీ అవకాశాలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల సినిమాతో మరో విజయం సాధించే అవకాశం కూడా ఉంది.


