|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుబేర ట్రైలర్ వచ్చేసింది.. సరస్వతి దేవి కూడా తలెత్తుకోవాల్సిందే !

Published: 15-06-2025, 1:49 PM
కుబేర ట్రైలర్ వచ్చేసింది.. సరస్వతి దేవి కూడా తలెత్తుకోవాల్సిందే !

అక్కినేని నాగార్జున, ధనుష్, మరియు రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్ లో ధనుష్ బిచ్చగాడి పాత్ర, నాగార్జున సహాయం, మరియు రష్మిక పాత్రలు ఆకట్టుకున్నాయి.

Key Points

1

అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రధారులు

2

కుబేర ట్రైలర్ విడుదలైంది – అద్భుతమైన బిజిఎం!

4

నవంబర్ 20న థియేటర్లలో విడుదల

కుబేర ట్రైలర్ హైలైట్స్

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ్ హీరో ధనుష్ , హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలతో వస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర (Kuberaa). ఈ సినిమాను… దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు అలాగే టీజర్లు.. సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇక కాసేపటి క్రితమే కుబేర ట్రైలర్ ( Kuberaa Trailer) కూడా లాంచ్ అయింది.

నటీనటుల ప్రదర్శన

ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి.. కుబేర సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో రష్మిక, అక్కినేని నాగార్జున, హీరో ధనుష్ ప్రధాన పాత్రలలో కనిపించారు. ఈ ముగ్గురు చుట్టే కథ నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో ధనుష్ బిచ్చగాడి పాత్ర అని.. అతనికి అక్కినేని నాగార్జున హెల్ప్ చేస్తాడని తెలుస్తోంది. అలాగే రష్మిక మందనాతో… హీరో ధనుష్ పాత్ర ఎక్కువసేపు ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

సినిమా విడుదల తేదీ

ముఖ్యంగా డబ్బుల చుట్టే ఈ సినిమా తిరుగుతుందని… దానికి తగ్గట్టుగానే కుబేర… అనే టైటిల్ పెట్టినట్లు మనకు స్పష్టం అవుతుంది. అటు ట్రైలర్ లో బిజిఎం అదరగొట్టారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్ లోకి రాబోతుంది. కాగా కుబేర మూవీతో సరస్వతీ దేవి తల ఎత్తుకు అంటుందని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

కుబేర సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. నవంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.