|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kuberaa Movie: కుబేర… తెలుగు ‘వీర’ లేవరా

Published: 23-06-2025, 2:51 AM
Kuberaa Movie: కుబేర... తెలుగు 'వీర' లేవరా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా అనూహ్య విజయం సాధించింది. ధనుష్ నటన ప్రశంసలు అందుకుంటుండగా, తెలుగు హీరోలు ఇలాంటి పాత్రలను ఎందుకు చేయరు అన్న ప్రశ్నను ఈ కథనం లేవనెత్తుతోంది.

Key Points

1

శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని 'కుబేర' సినిమా అనూహ్య విజయం సాధించింది.

2

తెలుగు హీరోలకు 'కుబేర'లోని ధనుష్ పాత్రలాంటి ధైర్యం ఉందా అన్నది ప్రశ్న.

4

తెలుగు హీరోలు ఇమేజ్, గిమేజ్ కంటే నటనను ప్రాధాన్యతనిస్తారా?

‘కుబేర’ సినిమా విజయం: ఒక విశ్లేషణ

తెలుగు దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెలుగులో ఇప్పటిదాకా పలు చిత్రాలు తీశారు. మంచి అభిరుచి ఉన్న దర్శకుడు అనే పేరు మాత్రం తెచ్చుకోగలిగారు. కానీ ఆయనతో ఇప్పటివరకు తెలుగు అగ్రనటులు ఎవరూ పనిచేయలేదు. ఎందుకని? బహుశా వైవిధ్యభరిత పాత్రలను మాత్రమే ఆయన రూపకల్పన చేస్తారనా? లేదా తమ సూపర్‌‌మ్యాన్‌ ఇమేజ్‌కి తగ్గ హీరో పాత్రల్ని ఆయన సృష్టించలేరనా? ఇప్పుడు శేఖర్‌ కమ్ముల పేరు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మార్మోగుతోంది. ఆయన తీసిన ‘కుబేర’ కమర్షియల్‌గా మాత్రమే కాకుండా దాదాపు 100శాతం పాజిటివ్‌ రివ్యూలతో అనూహ్య విజయం సాధించింది.

ఇటీవలి కాలంలో ఒక్కసారి పరిశీలించి చూస్తే వెంకీ అట్లూరి, శేఖర్‌ కమ్ముల లాంటి తెలుగు దర్శకులు.. తమిళ హీరోలతో కలిసి పనిచేసినప్పుడు విజయవంతమైన చిత్రాలను అందించారు. సర్, లక్కీ భాస్కర్‌‌తో ఇప్పుడొచ్చిన ‘కుబేర’ చిత్రాలే స్పష్టమైన ఉదాహరణలు. ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర రాణించడంతో పాటు బలమైన, వైవిధ్యభరిత కథాకథనాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

తెలుగు హీరోలు, ధైర్యం, మరియు ‘కుబేర’ పాత్ర

మరోవైపు తెలుగు స్టార్లతో కలిసి పనిచేసిన తమిళ దర్శకులేమో అంతవరకూ చవిచూడని దారుణమైన డిజాస్టర్లకు తెర తీశారు. మహేష్‌ బాబు ‘స్పైడర్‌’ నుంచి రామ్‌ ‘ది వారియర్’, నాగ చైతన్య ‘కస్టడీ’, రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’.. ఇలా ఇవన్నీ తమిళ దర్శకులు తీసినవే. ఈ సినిమాలు అటు కలెక్షన్ల పరంగా, ఇటు క్వాలిటీ  పరంగా ఏ వర్గం ప్రేక్షకులనూ మెప్పించలేకపోయాయి. ఈ సినిమాల పరాజయాలకు తమిళ దర్శకులేనా బాధ్యులు?

ఇప్పటికైనా ఒప్పుకోక తప్పని వాస్తవం. ఆ బాధ్యత తీసుకోవాల్సింది తెలుగు హీరోలు, వారి ఆలోచనా ధోరణి మాత్రమే అని. నిజం చెప్పాలంటే ‘కుబేర’లో ధనుష్‌ పోషించిన బిచ్చగాడి పాత్రను పోషించేంత ధైర్యం.. బహుశా ధైర్యం అనకూడదేమో! నటనపై అంతటి ఇష్టం తెలుగు హీరోలకు ఉందా? ఇమేజి, గిమేజి అంటూ చేయబోయే పాత్ర విలువ కేజీల్లో కొలవకుండా ఆ బిచ్చగాడి పాత్రకి సై అనేవారా? అసాధ్యమే అనాలి. (నిజానికి ఈ పాత్ర కోసం శేఖర్‌కమ్ముల ఒకరిద్దరు తెలుగు హీరోలను ఒప్పించడానికి విఫల యత్నం చేశారని సమాచారం) కానీ అదే సమయంలో తమిళ్‌లో టాప్‌ హీరోగా వెలుగొందుతున్న ధనుష్‌ ఆ పాత్రను  అద్భుతంగా పండించాడు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకంటున్నాడు.

తమిళ దర్శకులు, తెలుగు సినిమాలు: విజయం, వైఫల్యాలు

అదే విధంగా మళయాల హీరో దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’ సినిమా విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న ఆ పాత్రను తెలుగు హీరోలు అంగీకరించలేరు. సురక్షితమైన, తమ కెరీర్‌కు గానీ, ఫాలోయింగ్‌కు గానీ ఎలాంటి ఇబ్బంది పెట్టని , హిట్‌ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌కు క్రేజీ హీరోగా నిలిపి ఉంచే లాంటి పరిమితులు… తెలుగు హీరోలను అనూహ్యమైన పాత్రల ఎంపిక నుంచి దూరంగా నెట్టేస్తున్నాయి. కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నట్టే, అభినయపరమైన అద్భుతాల ఆవిష్కరణలోనూ ముందుండాలంటే.. ‘కుబేర’ లాంటి విజయాలు చెబుతున్న పాఠాలను తెలుగు స్టార్స్‌ నేర్చుకోవాల్సిందే.

కుబేర సినిమా విజయం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక కొత్త దిశను సూచిస్తోంది. హీరోల పాత్రల ఎంపిక, నటనపై దృష్టి సారించడం ముఖ్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.