|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుంభమేళా సెన్సేషన్ లవ్ స్టోరీ: ముస్లిం వ్యక్తితో మోనాలిసా పెళ్లి! రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌కు!

Published: 11-03-2026, 12:35 PM
కుంభమేళా సెన్సేషన్ లవ్ స్టోరీ: ముస్లిం వ్యక్తితో మోనాలిసా పెళ్లి! రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌కు!
  • కుంభమేళాలో మెరిసిన మోనాలిసా ప్రేమ వివాహం.. ఫర్మాన్ ఖాన్‌తో ఏడడుగులు!
  • కేరళలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం.. భద్రత కోరుతూ పోలీసులను ఆశ్రయించిన జంట!
  • తండ్రి వేరే పెళ్లి సంబంధం.. తప్పించుకుని కేరళలో రహస్యంగా వివాహం!
  • మంత్రి శివన్‌కుట్టి స్పందన: ‘ఇదే అసలైన కేరళ స్టోరీ’.. మత సామరస్యానికి ప్రతీకగా పెళ్లి!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోనాలిసా పెళ్లి చేసుకుంది! ఆమె ఎవరిని వివాహం చేసుకుంది? ఎక్కడ చేసుకుంది? అసలు ఈ ప్రేమ కథ ఎలా మొదలైంది? తెలుసుకోవాలంటే వెంటనే చదవండి!

కుంభమేళాలో మొదలైన ప్రేమ కథ

Monalisa: మహా కుంభమేళాలో కనిపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోనాలిసా పెళ్లి చేసుకుంది. అది కూడా ఓ పోలీస్ స్టేషన్ లో కావడం విశేషం. ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లాడిన ఆమె.. తనకు రక్షణ కావాలని అడగడం గమనార్హం.

గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఇండోర్ అమ్మాయి మోనాలిసా భోంస్లే (మోనీ) ఎట్టకేలకు తన ప్రేమను గెలిపించుకుంది. తన ప్రియుడు, మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె బుధవారం (మార్చి 11) కేరళలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. భిన్న మతాలకు చెందిన వీరి వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కేరళలో హిందూ సంప్రదాయంలో వివాహం

ఫేస్‌బుక్ స్నేహం.. కేరళలో పెళ్లి

మోనాలిసా తండ్రి జైసింగ్ భోంస్లే ఆమెను వేరే వ్యక్తితో వివాహం చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా, ఆమె మలయాళ మూవీ ‘నాగమ్మ’ షూటింగ్ కోసం కేరళ వచ్చినప్పుడు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు.

రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన జంట

దీంతో ఈ జంట రక్షణ కోసం కేరళ పోలీసులను ఆశ్రయించింది. మోనాలిసా మేజర్ కావడంతో ఆమెకు నచ్చిన వ్యక్తితో ఉండే హక్కు ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో తిరువనంతపురంలోని అరుమనూర్ ఆలయం వీరి వివాహానికి వేదికైంది.

ఈ సందర్భంగా మంత్రి శివన్‌కుట్టి మాట్లాడుతూ.. “ఇదే అసలైన కేరళ స్టోరీ” అని వ్యాఖ్యానించారు. మతసామరస్యానికి ఈ పెళ్లి ఒక ప్రతీక అని ఎంపీ రహీమ్ పేర్కొంటూ, “పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి.. ఆ స్వర్గమే కేరళ” అని కొనియాడారు.

మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ల వివాహం ఇప్పుడు హాట్ టాపిక్. వీరి ప్రేమ కథకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.