|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుంభమేళా సుందరి మోనాలిసా.. ఇప్పుడు షాప్ ఓపెనింగ్స్ తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం!

Published: 20-12-2025, 9:04 PM
కుంభమేళా సుందరి మోనాలిసా.. ఇప్పుడు షాప్ ఓపెనింగ్స్ తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం!
  • కుంభమేళాలో అందంతో వైరల్ అయిన మోనాలిసా సినీ రంగ ప్రవేశం.
  • బాలీవుడ్ లో ఒక సినిమా, తెలుగులో హీరోయిన్‌గా ఇటీవలే ఓపెనింగ్.
  • హీరోయిన్ అవకాశాలతో పాటు షాప్ ఓపెనింగ్స్ కూడా చేస్తున్న మోనాలిసా.
  • హైదరాబాద్ బేల్ ట్రీ హోటల్ కిచెన్ ప్రారంభించి, కాఫీ చేసి, ఆహారాన్ని మెచ్చుకుంది.

కుంభమేళాలో తన అందంతో దేశవ్యాప్తంగా వైరల్ అయిన మోనాలిసా, ఇప్పుడు సినిమా ఛాన్సులతో పాటు షాప్ ఓపెనింగ్స్ తోనూ బిజీగా ఉంది. ఇటీవల హైదరాబాద్ లో ఓ కిచెన్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె కెరీర్ లో వచ్చిన కొత్త మలుపుల గురించి తెలుసుకుందాం.

కుంభమేళా నుండి సినిమా స్క్రీన్ దాకా

Monalisa : కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన అందంతో బాగా వైరల్ అయిపోయింది మోనాలిసా. దెబ్బకి సినిమా ఛాన్సులు కూడా క్యూ కట్టాయి. బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుండగా తెలుగులో కూడా ఇటీవలే హీరోయిన్ గా ఒక సినిమా ఓపెనింగ్ అయింది. నార్త్ లోనే కాక సౌత్ లో కూడా మోనాలిసా వైరల్ అయిపోతుంది.

ఓ పక్క హీరోయిన్ చాన్సులే కాకుండా ఇప్పుడు షాప్ ఓపెనింగ్స్ కూడా చేస్తుంది. తాజాగా కుంభమేళా మోనాలిసా హైదరాబాద్ లోని బేల్ ట్రీ హోటల్ కి సంబంధించిన అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని ప్రారంభించింది. రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కిచెన్ ప్రారంభించడమే కాదు కాఫీ కూడా పెట్టింది మోనాలిసా. అనంతరం మోనాలిసా బేల్ ట్రీ హోటల్ ఫుడ్ తిని చెఫ్ లను, హోటల్ ని మెచ్చుకుంది. ఇక మోనాలిసాని చూడటానికి జనాలు కూడా బాగానే వచ్చారు.

హీరోయిన్‌గా మోనాలిసా క్రేజ్

షాప్ ఓపెనింగ్స్ తో తెలుగు రాష్ట్రాల్లో హవా

ఈ హోటల్ అధినేత రాజారెడ్డి బేల్ ట్రీ అంటే తెలుగులో బిల్వ వృక్షం. బిల్వ పత్రం అంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే శివుడి కృపతో ఆ పేరు పెట్టాం అని తెలిపారు.

కుంభమేళా నుండి తెలుగు రాష్ట్రాల షాప్ ఓపెనింగ్స్ వరకు, మోనాలిసా ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఆమె అందం, క్రేజ్ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆమె భవిష్యత్ ప్రాజెక్టుల కోసం వేచి చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.