|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బరువు తగ్గేందుకు తక్కువ తిన్నాను.. టీబీ వచ్చింది: బాలీవుడ్‌ నటి కుషా కపిలా

Published: 01-06-2025, 4:16 AM
బరువు తగ్గేందుకు తక్కువ తిన్నాను.. టీబీ వచ్చింది: బాలీవుడ్‌ నటి కుషా కపిలా

బాలీవుడ్ నటి కుషా కపిలా తన బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఎదుర్కొన్న కష్టాలను, అతిగా బరువు తగ్గడం వల్ల టీబీ వచ్చిన విషయాన్ని వెల్లడించింది. ఆమె అనుభవం ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

Key Points

1

బరువు తగ్గించుకోవడానికి కఠినమైన డైట్ చేసి, రోజుకు 800 కేలరీల కంటే తక్కువ తీసుకున్నారు.

2

అతిగా బరువు తగ్గడం వల్ల టీబీ సోకింది.

4

వైద్యులు ఆమె లైఫ్‌స్టైల్‌ను మార్చుకోమని సూచించారు.

కఠినమైన డైట్ మరియు బరువు తగ్గడం

సినిమా తారలకు ఫిట్‌నెస్‌ చాలా అవసరం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సివస్తోంది. కొంచెం బొద్దుగా కనిపించినా సరే.. వాళ్లను దూరం పెట్టేస్తుంటారు. అందుకే హీరోయిన్లు తమ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. బరువుని కంట్రోల్‌ చేసేందుకు డైటింగ్‌తో పాటు డేటింగ్‌ కూడా చేస్తుంటారు. అయినప్పటికీ వారి శరీరంపై ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్‌ నటి కుషా కపిల(Kusha Kapila) శరీరంపై కూడా నెట్టింట ట్రోలింగ్‌ జరిగింది. ఉన్నపళంగా బరువు తగ్గడంపై రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై స్వయంగా కుషానే వివరణ ఇచ్చింది. తన బాడీ గురించి ఇతరులతో మాట్లాడాల్సిన అవరసం లేదని..తనకు నచ్చినట్లుగా తాను ఉంటానని చెబుతూనే ఎందుకు బరువు తగ్గాల్సి వచ్చింది వివరించింది.

బరువు తగ్గడం నాకేమి కొత్తకాదు. స్కూల్‌ డేస్‌లో ఉన్నప్పుడే నేను బరువు పెరిగాను. దీంతో మా అమ్మ నన్ను జిమ్‌లో జాయిన్‌ చేయించడంతో మళ్లీ మాములు స్థితికి వచ్చాను. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో మళ్లీ నా బరువు విపరీతంగా పెరిగింది. ఎందుకు అలా జరిగిందో తెలియదు. నా బాడీని పట్టించుకోకుండా నా కామెడీపైనే ఎక్కువ ఫోకస్‌ చేశాను. లెక్చర్లు కూడా నా చదువుని పట్టించుకోకుండా నా కామెడీని ఎంజాయ్‌ చేసేవాళ్లు. 22 ఏళ్ల వయసులో నేను చాలా బరువు పెరిగాను. దీంతో నా ఫ్రెండ్స్‌ ఫోటోలు షేర్‌ చేసి ‘ఇలా మారిపోయావేంటి?’ అని అడిగారు. వారి మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. నా బాడీపై ఫోకస్‌ పెట్టాను. ఆరు నెలల్లో విపరీతంగా తగ్గిపోయాను. రోజుకు 800 క్యాలరీస్‌ కంటే తక్కువ ఆహారాన్ని తీసుకున్నాను. ఆ సమయంలో నా శరీరంలో భారీగా మార్పులు జరిగాయి. చాలా సన్నబడిపోయాను. 12 రోజుల పాటు జ్వరం వచ్చింది. కొన్నాళ్ల పాటు అన్నం కూడా తినలేదు. ఆస్పత్రికి వెళితే.. టీబీ అటాక్‌ అయిందని చెప్పారు. తక్కువ తినడం కారణంగానే టీబీ వచ్చిందని చెప్పారు. ఇమ్యునిటీ పవర్‌ పూర్తిగా తగ్గిపోయింది.

టీబీ నిర్ధారణ మరియు దాని కారణాలు

టీబీ కారణంగా బరువు తగ్గినా.. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అంతలా నా మైండ్‌ మారిపోయింది. కానీ నేను 30 ఏళ్లకు వచ్చేసరికి.. పనిపై ఫోకస్‌ పెట్టి శరీరాన్ని పట్టించుకోవడం వదిలేశాను. డైట్‌ ఫాలో కాలేదు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రం తీసుకున్నాను. ముంబైకి వెళ్లిన తర్వాత బరువు పెరగడం, తగ్గడం స్టార్ట్‌ అయింది. అయినా కూడా నేను నా పనిపైనే ఫోకస్‌ పెట్టాను. వైద్యులను సంప్రదిస్తే.. నీ లైఫ్‌స్టైల్‌ని పూర్తిగా మార్చుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి నేను మళ్లీ నా బాడీపై ఫోకస్‌ చేశాను.డైట్‌ ఫాలో అయ్యాను.

33 ఏళ్ల వయసులో నేను కాస్త లావుగానే ఉన్నాను. దీంతో 45-50 ఏళ్ల ఆంటీ​ పాత్రలే ఎక్కువ వచ్చాయి. అప్పట్లో ఆ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా చేశానో ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు బరువు తగ్గడానికి కారణం కూడా సినిమా చాన్స్‌ల కోసమే. జిమ్‌ చేస్తూ డైట్‌ ఫాలో అవుతున్నాను. నా బాడీపై ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నాను. నా శరీరంతో నేను ఏదైనా చేస్తా. ఏం చేస్తున్నానని ఇతరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అని కుషా కపిల చెప్పుకొచ్చింది.

కుషా కపిలా అనుభవం మరియు సలహా

కుషా కపిల కెరీర్‌ విషయానికొస్తే.. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌‍ల్లోనూ నటించారు. అనంతరం 2017లో కుషా కపిల.. జోరావర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారామె. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2023లో విడిపోయారు.

కుషా కపిలా అనుభవం ఆరోగ్యంపై అతిగా శ్రద్ధ వహించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. బరువు తగ్గడం ముఖ్యం అయినా, ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరించడం చాలా అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.