
📌 Key Points
- దర్శకుడు కె.వి. అనుదీప్ చిత్రం ‘ఫంకీ’ ఫిబ్రవరి 13న విడుదల కానుంది.
- విశ్వక్ సేన్ దర్శకుడి పాత్రలో నటిస్తున్నాడు, ఇది ఒక రొమాంటిక్ కామెడీ.
- ‘జాతిరత్నాలు’ కంటే భిన్నంగా, ఇది ఒక పూర్తి వినోదాత్మక చిత్రం అవుతుంది అని అనుదీప్ తెలిపారు.
- చిత్రానికి ‘ఫంకీ’ టైటిల్ పెట్టడానికి కారణం క్యాచీగా ఉండటమేనని అనుదీప్ చెప్పారు.
దర్శకుడు కె.వి. అనుదీప్ తన కొత్త చిత్రం ‘ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా, ఫిబ్రవరి 13న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుదీప్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘ఫంకీ’ టైటిల్ వెనుక కథ ఏమిటి?
KV Anudeep: కెవి అనుదీప్ ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ పరిచయమే. ‘జాతిరత్నాలు’ చిత్రంతో హాస్య చిత్రాలలో కొత్త పంథాను సృష్టించిన దర్శకుడు కె.వి. అనుదీప్. ఇప్పుడో మరోసారి అలాంటి మ్యాజిక్ చేసేందుకు ‘ఫంకీ’ (Funky)తో రాబోతున్నారు. టైటిల్‌తోనే మంచి ఆసక్తిని కనబరిచిన అనుదీప్.. ఈ సినిమాతో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నాడనేలా ప్రమోషనల్ కంటెంట్‌తో మెప్పించాడు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ కయాదు లోహర్ (Kayaadu Lohar) హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న విడుదలకాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. అందులో భాగంగా కెవి అనుదీప్ (KV Anudeep) మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. అందులో ఈ సినిమాకు ‘ఫంకీ’ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని తెలిపారు.
విశ్వక్ సేన్ పాత్ర ఎలా ఉండబోతుంది?
‘‘ఈ సినిమాకు ‘ఫంకీ’ అనే టైటిల్ పెట్టడానికి పెద్ద కారణం ఏం లేదు. టైటిల్ వినడానికి చాలా క్యాచీగా ఉంది. అలాగే ఈ తరం అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుందని ఈ టైటిల్‌ను ఎంచుకున్నాం. అంతేకాదు, హీరో పాత్రకు కూడా ఈ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. రేపు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కచ్చితంగా పర్ఫెక్ట్ టైటిల్ అనే అంటారు. విశ్వక్ సేన్ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటాడని అనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా చూశాను.. అందులో ఆయన కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది. అందుకే నేను కథని ఆయన కోణంలోనే రాసుకున్నాను.
‘జాతిరత్నాలు’కు ఇది ఎంత వరకు భిన్నం?
‘జాతిరత్నాలు’తో పోలిస్తే ‘ఫంకీ’ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా చాలా సరదాగా చూపించాను. అలాగే ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు ఇందులో ఉంటాయి. నిజ జీవితంలో కూడా ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశానికి ఖచ్చితంగా లాజిక్ ఉంటుంది. నా సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, లాజిక్ ఉండదని అందరికీ అనిపిస్తుంది. కానీ అన్ని సినిమాల్లో లాజిక్ ఉంటుంది. లాజిక్ లేకుండా కామెడీ ఉండదు. ఇందులో నేను కూడా అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు నటుడిగా కంటే దర్శకుడిగా సినిమాలు చేయడమే ఆసక్తి. ప్రస్తుతం మూడు సినిమాలకు కమిటయ్యాను. విక్టరీ వెంకటేష్‌తో ఒక సినిమా ఉంటుంది’’ అని కెవి అనుదీప్ చెప్పుకొచ్చారు.
కెవి అనుదీప్ ‘ఫంకీ’ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని ఆశిద్దాం.


