|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Lakshmi Manchu: ‘శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే’.. మంచు లక్ష్మీ పోస్ట్!

Published: 27-06-2025, 4:00 PM
Lakshmi Manchu: 'శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే'.. మంచు లక్ష్మీ పోస్ట్!

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా విడుదలై సూపర్ హిట్ అవుతోంది. ఈ సినిమా గురించి మంచు లక్ష్మీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Key Points

1

మంచు లక్ష్మీ 'కన్నప్ప' సినిమాపై ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

2

శివుని సేవ గురించి ఆమె పేర్కొన్న విషయం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

4

కన్నప్ప సినిమాను థియేటర్లలో చూడాలని లక్ష్మీ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

మంచు లక్ష్మీ చేసిన కన్నప్ప సినిమా పోస్ట్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన కన్నప్ప ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో కన్నప్ప టీమ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ చూసిన మంచు మనోజ్ తన రివ్యూ కూడా ఇచ్చేశారు. అన్న ఇంత బాగా చేస్తాడని ఊహించలేదని అన్నారు. అలాగే ప్రభాస్ నటనపై ప్రశంసలు కురిపించారు.

శివుని సేవ మరియు కన్నప్ప సినిమా

అయితే తాజాగా మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న కూడా కన్నప్ప మూవీపై పోస్ట్ చేసింది.  శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఈ సందర్భంగా కన్నప్ప టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిది. మీరంతా కన్నప్ప సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలంటూ అభిమానులను కోరింది. మంచు ఫ్యామిలీ వివాదం తర్వాత మొదటిసారి మంచు మనోజ్, మంచు లక్ష్మీప్రసన్న పాజిటివ్‌గా పోస్టులు చేయడంతో విష్ణు ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంచు ఫ్యామిలీ సోషల్ మీడియా పోస్టులు

కాగా.. ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

మంచు లక్ష్మీ చేసిన ఈ పోస్ట్ కన్నప్ప సినిమాపై అభిమానుల ఆసక్తిని పెంచింది. మంచు ఫ్యామిలీ మధ్య సామరస్యం కనిపించడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.