|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సియా గోయల్ నిర్లక్ష్యం: మీడియాకు మధ్య వేలు, తండ్రి వింత వివరణ!

Published: 06-07-2026, 9:40 AM
సియా గోయల్ నిర్లక్ష్యం: మీడియాకు మధ్య వేలు, తండ్రి వింత వివరణ!
  • కేతన్ అగర్వాల్ హత్య కేసు నిందితురాలు సియా గోయల్ మీడియాకు మధ్య వేలు చూపింది.
  • పూణేలోని తన నివాసం నుంచి బయటకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
  • సియా తండ్రి ప్రవీణ్ గోయల్, ఆమె వేలికి గాయం అయ్యిందని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
  • ఈ చర్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయవ్యవస్థపై గౌరవం లేదంటున్నారు.

కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్ మీడియాకు మధ్య వేలు చూపించి తీవ్ర వివాదానికి తెరలేపింది. ఆమె చర్యపై నెటిజన్లు మండిపడుతుండగా, తండ్రి ప్రవీణ్ గోయల్ చేసిన వింత వివరణ మరింత చర్చకు దారితీసింది. ఈ ఘటన న్యాయవ్యవస్థపై గౌరవంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

సియా గోయల్ వివాదాస్పద చర్య

కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ రీసెంట్ గా మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఓవర్ యాక్షన్ చేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు సియా గోయల్‌ను పూణేలోని తమ నివాసానికి తీసుకువెళ్లారు. ఇంట్లో తనిఖీలు చేసిన అనంతరం సియా బయటకు వస్తుండగా అక్కడ ఉన్న మీడియావాళ్లు ఆమెను వీడియో తీశారు. ఈ క్రమంలో సియా గోయల్ వారికి మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లి పోలీస్ జీప్ లో కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి సియాగోయల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. న్యాయవ్యవస్థలపై, మీడియాపై సియాకు ఎలాంటి గౌరవం లేదని అంటున్నారు.

దర్జాగా ప్రియుడితో కలిసి కేతన్ ను హత్య చేసి మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సియా గోయల్ కూడా ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన హనీమూన్ మర్డర్ కేసు నిందితురాలు సోన‌మ్ ర‌ఘువంశీ మాదిరిగా బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మిడిల్ ఫింగ‌ర్ వ్య‌వ‌హారంపై సియా గోయ‌ల్ తండ్రి ప్ర‌వీణ్ స్పందించారు. సియా గోయ‌ల్ మీడియాకు మిడిల్ ఫింగ‌ర్ చూపించ‌లేద‌ని, కారు ఎక్కుతున్న స‌మ‌యంలో ఆమె మ‌ధ్య వేలికి గాయం అయ్యింద‌ని క‌వ‌రింగ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. వీడియోలో క్లియ‌ర్ గా సియా గోయ‌ల్ ఫింగ‌ర్ చూపిస్తున్న‌ట్టు క‌నిపిస్తున్నా ఆమె తండ్రి క‌వ‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తండ్రి ప్రవీణ్ గోయల్ వివరణ

నెటిజన్ల ఆగ్రహం, న్యాయవ్యవస్థపై చర్చ

సియా గోయల్ చర్య, ఆమె తండ్రి వివరణ సమాజంలో తీవ్ర చర్చకు దారితీసింది. న్యాయవ్యవస్థ పట్ల నిందితుల వైఖరి, మీడియా స్వేచ్ఛపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.