
ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి బేబీ బంప్ తో కనిపించింది. మాల్దీవ్స్ లో తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Key Points
లావణ్య త్రిపాఠి బేబీ బంప్‌తో కనిపించింది.
మాల్దీవ్స్ వేకేషన్ ఫోటో వైరల్ అవుతోంది.
వరుణ్ తేజ్ తో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లావణ్య త్రిపాఠి బేబీ బంప్ ఫోటో వైరల్
సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది ఈ అమ్మడు. అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ‘మిస్ పర్‌ఫెక్ట్’(Miss Perfect) అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటిస్తోంది. అయితే రీసెంట్‌గా ఈ చిన్నది తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ అమ్మడు బేబీ బంప్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా లావణ్య తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో మాల్దీవ్స్ వేకేషన్స్‌కు వెళ్లిన ఈ బ్యూటీ తన భర్తతో దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేసింది. అయితే ఆ పిక్‌లో లావణ్య బేబీ బంప్ కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. సో క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మాల్దీవ్స్ వేకేషన్ ఫోటోలు
నెటిజన్ల స్పందన
లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్న సందర్భంగా ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.


