|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి క్రైమ్ థ్రిల్లర్.. సడన్‌గా ఓటీటీకి!

Published: 17-10-2025, 10:19 AM
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి క్రైమ్ థ్రిల్లర్.. సడన్‌గా ఓటీటీకి!

లావణ్య త్రిపాఠి నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘టన్నెల్’ థియేటర్లలో నిరాశపరిచింది. సెప్టెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం నెల రోజులు కాకుండానే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను చూడవచ్చు.

Key Points

1

లావణ్య త్రిపాఠి, అథర్వా మురళి నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'టన్నెల్'.

2

సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైనప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

4

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది.

థియేటర్లలో విడుదల, ఓటీటీ ఎంట్రీ

మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన చిత్రం టన్నెల్(Tunnel). కోలీవుడ్ హీరో అథర్వా మురళి సరసన ఈ చిత్రంలో కనిపించింది. తమిళంలో తనల్(Thanal) పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీకి  రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లచ్చురామ్‌ ప్రొడక్షన్స్‌పై  ఎ. రాజు నాయక్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో   అథర్వ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. అశ్విన్‌  కాకుమాను విలన్‌గా మెప్పించారు.

తాజాగా ఈ చిత్రం నెల రోజులైనా కాకముందే ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరన్ సంగీతమందించారు.

టన్నెల్ కథాంశం, తారాగణం

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ వివరాలు

బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిన ‘టన్నెల్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడం అభిమానులకు కొంత ఊరటనిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్‌లో దీనిని వీక్షించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.