
📌 Key Points
- మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ వార్నింగ్: మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను అంటూ సంచలన వ్యాఖ్యలు!
- చిరంజీవి గారిపై విమర్శలు చేసేవారికి అసలు అవగాహన లేదు, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత లేదు: లావణ్య ఫైర్.
- మార్చి 6న లావణ్య త్రిపాఠి నటించిన ‘సతీ లీలావతి’ విడుదల, దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు.
- చిరంజీవి ఇంటికి వెళ్తే లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉంటారంటూ చేసిన కామెంట్స్‌పై లావణ్య ఘాటు రియాక్షన్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి మరోసారి వార్తల్లో నిలిచారు. చిరంజీవి గారిపై జరుగుతున్న ట్రోల్స్ పై ఆమె ఘాటుగా స్పందించారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి.
చిరంజీవిపై విమర్శలకు లావణ్య కౌంటర్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘అందాల రాక్షసి’(Andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో ప్రేమలో పడి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది. ఇక రీసెంట్‌గా ఒక బాబుకు జన్మకూడా ఇచ్చింది. అయితే ఈ చిన్నది మ్యారేజ్ తర్వాత ‘సతీ లీలావతి’(Sathi Leeelavathi) అనే సినిమా చేస్తోంది. దేవ్ మోహన్ (Dev Mohan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ (Anandi Art Creations) సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ (Durga Devi Pictures) బ్యానర్‌పై నాగమోహన్, రాజేష్.టి ఈ మూవీను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోను. చిరంజీవి గారు ఇంట్లో ఎలా ఉంటారనేది మాకు తెలుసు. ఆయన మా కుటుంబంలోని మహిళల్ని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో ఈ విమర్శలు చేసేవారికి అస్సలు అవగాహన లేదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదు కాబట్టి మా ఫ్యామీలీ జోలికొస్తే ఊరుకోను’ అని గట్టిగా చెప్పుకొచ్చింది.
‘సతీ లీలావతి’తో లావణ్య రీఎంట్రీ!
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా గతేడాది బ్రహ్మానందం అనే సినిమా ఈవెంట్‌లో చిరంజీవి.. ఇంటికి వెళ్తే లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉంటుందంటూ సరదాగా చేసిన కామెంట్స్ బాగా వివాదం అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ కామెంట్స్‌ను గుర్తు చేస్తూ మొన్న రామ్ చరణ్(Ram Charan)-ఉపాసన(Upasana) దంపతులకు బాబు పుట్టిన వేళ చిరంజీవిని మళ్లీ ట్రోల్ చేశారు. ఆ విమర్శలకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. సంతోషకరమైన క్షణాలను వివాదాస్పదం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ, చిరంజీవి మహిళలను గౌరవించే తీరును, ఇతరులను విమర్శించే ముందు వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఆమె రీసెంట్‌గా ట్విట్టర్‌లో ఘాటుగా స్పందిచిన సంగతి విదితమే.
మెగా ఫ్యామిలీకి అండగా నిలిచిన కోడలు!
‘‘నేను కేవలం బొమ్మను కాదు’’.. ప్రియాంక చోప్రా ఎమోషనల్ కామెంట్స్
లావణ్య త్రిపాఠి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


