
నటి లయ ‘తమ్ముడు’ సినిమాలో నితిన్ అక్కగా నటించారు. సినిమా కోసం ఆమె 7 కిలోలు బరువు పెరిగి, అమెరికాలోని ఉద్యోగాన్ని మానేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర, ఆమె అనుభవాలు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి ఈ కథనం వివరిస్తుంది.
Key Points
లయ 'తమ్ముడు' సినిమాలో నితిన్ అక్కగా నటించారు.
సినిమా కోసం 7 కిలోలు బరువు పెరిగారు.
అమెరికాలోని ఉద్యోగాన్ని మానేసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం శివాజీగారితో సినిమాలో నటిస్తున్నారు.
‘తమ్ముడు’ సినిమాలో లయ పాత్ర
‘‘మా కథకి ‘తమ్ముడు’ సరైన టైటిల్. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు. ఈ సినిమాలో నితిన్‌కి అక్క పాత్ర చేశాను. నటన పరంగా చూస్తే నితిన్ మెచ్యూర్డ్‌గా కనిపిస్తారు. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చేశారు’’ అని నటి లయ ( Actress Laya ) తెలిపారు. నితిన్ హీరోగా రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించిన లయ పంచుకున్న విశేషాలు.
2023లో ఇండియాకు.. వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. అప్పుడు కొన్ని యూట్యూబ్ చానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలు చూసిన ‘తమ్ముడు’ మూవీ టీమ్ నుంచి జూన్‌లో నాకు ఫోన్ వచ్చింది. నటిస్తారా? అని అడిగితే ఓకే అన్నాను. ‘తమ్ముడు’ కథ ఓ లైన్‌గా చెప్పారు. ఝాన్సీ కిరణ్మయి పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పడంతో స్వీట్స్ బాగా తిని, 7 కిలోలు బరువు పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్‌కి వచ్చాక పూర్తి కథ విన్నాను. నా రీ ఎంట్రీకి ‘తమ్ముడు’ సరైన సినిమా అని బలంగా అనిపించి, నటించాను.
ఉద్యోగం మానేసి సినిమాల్లోకి
ఉద్యోగం మానేశా ‘తమ్ముడు’ సినిమా కోసం హైదరాబాద్ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు… అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది. ఝాన్సీ కిరణ్మయి స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది. నా క్యారెక్టర్‌లో స్ట్రిక్ట్‌నెస్‌తో పాటు ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి.
అమెరికాలోనే కాదు హైదరాబాద్‌లోనూ.. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటించాలని అనుకుంటున్నాను. నేను అమెరికా నటిని కాదు… పక్కా హైదరాబాద్ నటినే. నాకు అమెరికాలో ఇల్లు ఉంది. హైదరాబాద్‌లోనూ ఉంది. నాకోసం ఫ్లైట్స్‌లో బిజినెస్ క్లాస్ టికెట్స్, స్టార్ హోటల్స్‌లో వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని నా ఇంట్లో ఉంటాను. ప్రస్తుతం శివాజీగారితో చేస్తున్న ఓ సినిమా తుది దశకు వచ్చింది. కొన్ని కథలు వింటున్నాను.
భవిష్యత్తు ప్రణాళికలు
తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించిన లయ, ‘తమ్ముడు’ సినిమాతో పాటు మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడి, తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోవాలని ఆమె ఆశిస్తున్నారు.


