|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లెజెండ్ శరవణన్ ‘లీడర్’: థియేటర్లు దద్దరిల్లేలా మాస్ ట్రీట్! రికార్డుల మోత మోగాల్సిందే!

Published: 04-04-2026, 9:05 AM
లెజెండ్ శరవణన్ 'లీడర్': థియేటర్లు దద్దరిల్లేలా మాస్ ట్రీట్! రికార్డుల మోత మోగాల్సిందే!
  • లెజెండ్ శరవణన్ హీరోగా ‘లీడర్’ మూవీ విడుదల, భారీ అంచనాలతో థియేటర్లలో సందడి!
  • పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా, ఆండ్రియా, శ్యామ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం.
  • తుత్తుకూడి పోర్ట్‌లో అక్రమాలను అరికట్టే శక్తివేల్ పాత్రలో శరవణన్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి.
  • ‘లీడర్’ మూవీలో ప్రభాకర్ విలనిజం, సాల్ట్ పాత్రలో అదరగొట్టిన నటన!

లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన ‘లీడర్’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, శరవణన్ అభిమానులకు పండుగలాంటిదే. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించగా, సినిమా ఎలా ఉందో చూద్దాం!

శక్తివేల్ పాత్రలో శరవణన్ అదరగొట్టాడా?

చెన్నైలో ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, లెజెండ్‌ శరవణన్‌ హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు. గతంలో `ది లెజెండ్‌` పేరుతో సినిమా చేసి అలరించిన ఆయన నాలుగేళ్ల గ్యాప్‌తో ఇప్పుడు `లీడర్‌` అనే చిత్రంలో నటించాడు. పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఆండ్రియా, శ్యామ్‌, అమృత అయ్యర్, లాల్‌, ప్రభాకర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్‌ఎస్‌ దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లెజెండ్‌ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్‌ పతాకంపై లెజెండ్‌ శరవణన్‌ నిర్మించారు. ఈ మూవీ ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 3)న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తమిళంలో రూపొందిన ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో రిలీజ్‌ చేశారు. మరి సినిమా ఎలా ఉంది? శరవణన్‌ కి హిట్‌ పడిందా? తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

శక్తివేల్‌(లెజెండ్‌ శరవణన్‌) తన కూతురుతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్‌ చేస్తుంటాడు. ఆయన భార్య మీరా(పాయిల్‌ రాజ్‌పుత్‌) తన కూతురుకి జన్మనిచ్చి చనిపోతుంది. దీంతో పాపే ప్రాణంగా బతుకుతుంటాడు శక్తివేల్‌. తుత్తుకూడి పోర్ట్ సమీపంలోని ఒక కార్‌ గ్యారేజ్‌లో మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఆ పోర్ట్ లో సాల్ట్(ప్రభాకర్‌) కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతాయి. పోర్ట్ కంటెయినర్ల నుంచి ప్రమాదకర కెమికల్స్ స్మగ్లింగ్‌ జరుగుతుంటాయి. దీన్ని లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ ఇంద్ర (ఆండ్రియా) ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటారు. కానీ అందుకు పోలీసులు సపోర్ట్ చేయరు. పోలీసులకు కూడా అందులో ప్రమేయం ఉంటుంది. దీంతో శక్తివేల్‌ సాయం కోరగా, ఆయన రిజెక్ట్ చేస్తాడు. కానీ ఆమె ఒక గేమ్‌ ఆడి తుత్తుకూడి పోర్ట్ లో భారీ పేలుడు పదార్థాలతో ఉన్న కంటెయినర్‌ని సీజ్‌ చేసేలా చేస్తుంది. ఇందులోకి శక్తివేల్‌ని లాగుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ గేమ్ లోకి ఇంద్రనే లాగుతాడు శక్తివేల్‌. ఇదంతా ఆయనే ప్లాన్‌ చేస్తాడు. అంతేకాదు ఆ కంటెయినర్లని బ్లాక్‌ చేసి దాన్ని పేల్చేస్తాడు. ఈ క్రమంలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న ఎస్పీ భక్తవత్సలం బలవుతాడు. ఆయన ఉద్యోగం పోతుంది. దీంతో శక్తివేల్‌ గురించి విచారించగా ఇంద్ర తండ్రి(లాల్‌) అసలు విషయాలు బయటపెడతాడు. మరి ఇంతకి శక్తివేల్‌ ఎవరు? ఆయన అసలు పేరేంటి? గతంలో ఆయన ఏం చేసేవాడు? తనతో ఉన్నది పాప అంకుల్‌ అని ఎందుకు పిలుస్తుంది? మీరా పాత్రలోని ట్విస్ట్ ఏంటి? స్మగ్లర్‌ సాల్ట్ వెనుక ఉన్నదెవరు? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

తండ్రి కూతుళ్ల మధ్య బాండింగ్‌ నేపథ్యంలో సాగే ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రం. శరవణన్‌.. చాలా గ్యాప్‌తో ఒక మంచి సినిమాతో వచ్చాడు. మంచి కథ, కథనాలతో కూడిన సినిమాని చేశాడు. అంతకంటే ముఖ్యంగా మంచి దర్శకుడిని పట్టుకున్నారు. ఒక భారీ బడ్జెట్‌ సినిమా స్థాయిలో, భారీ కమర్షియల్‌ సినిమా స్థాయిలో దీన్ని తెరకెక్కించడం విశేషం. తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్‌తో ప్రారంభమై ఆ తర్వాత యాక్షన్‌ వైపు టర్న్ తీసుకుంటుంది. ఇక ట్విస్ట్ లు, టర్న్ లతో సినిమా సాగుతుంది. రేసిగా వెళ్తుంది. హీరోకి సంబంధించిన ట్విస్ట్ లు, ఆయన ఎత్తులు, పై ఎత్తులు ఆశ్చర్యపరుస్తుంటాయి. సినిమా ప్రారంభంలో ఒక నార్మల్‌ గా స్టార్ట్ అవుతుంది. హీరో సింపుల్‌ లైఫ్‌ని లీడ్‌ చేయడం, తన డ్యూటీకి తాను వెళ్లడం, పాపని స్కూల్‌లో డ్రాప్‌ చేసి, పికప్‌ చేసుకోవడం ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక పోర్ట్ లో సాల్ట్ చేసే కార్యకలాపాలను ఆవిష్కరిస్తూ సినిమా సీరియస్‌ వైపు వెళ్తుంది. దానికి హీరోకి లింక్‌ చేస్తూ, అందులో హీరో ఇన్ వాల్వ్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. చాలా నేచురల్‌గా వెళ్తుంది.

పోలీస్ ఆఫీసర్‌గా ఆండ్రియా మెప్పించిందా?

ఆ తర్వాత నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్‌ అవుతుంది. హీరోకి సంబంధించిన ట్విస్ట్ ఒకదాన్ని మించి మరోటి వస్తుంటాయి. సినిమా కథ ఏమాత్రం ఊహించేలా లేదు. ఊహకందని విధంగా ఉంది. అక్కడే దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. సినిమాని ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా తీసుకెళ్లాడు. అయితే ఇందులో హీరో ఇమేజ్‌తో కాకుండా బలమైన కథతో సినిమా నడిపించిన తీరు బాగుంది. దానికి శరవణన్‌ అంతే బాగా న్యాయం చేశాడు. అదరగొట్టాడు. బిజీఎం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. హీరోకి ఎలివేషన్లు ఇవ్వడంతోపాటు, యాక్షన్‌ సీన్లు, ఛేజింగ్‌ సీన్లలో ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. భారీ సినిమాలను తలపించింది. గూస్‌బంమ్స్ తెప్పించింది. శరవణన్‌ సినిమాకి ఈ రేంజ్‌ బీజీఎం ఊహించం. కానీ ఇందులో అదే మ్యాజిక్‌ చేసిందని చెప్పొచ్చు. అయితే కొంత కథ స్లోగా సాగుతుంది. ట్విస్ట్ లు ఎక్కువగానే ఉన్నా, చాలా వరకు లాజిక్‌ కి అందని విధంగా ఉన్నాయి. హీరోకి మించిన ఎలివేషన్లు ఉన్నాయి. కొన్ని ట్విస్ట్ లు కన్‌ఫ్యూజ్‌ చేస్తాయి. విలన్‌ కి సంబంధించిన ట్విస్ట్ లు నమ్మేలా లేవు. ఇవన్నీ పక్కన పెడితే శరవణన్‌ నుంచి ఇదొక సర్‌ప్రైజ్‌ అని చెప్పొచ్చు.

శక్తివేల్‌గా, మారన్‌గా లెజెండ్‌ శరవణన్‌ నటన ఆకట్టుకుంటుంది. ఆయన గతంతో పోల్చితే చాలా బాగా చేశాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ లు ఆద్యంతం ఆకట్టుకుంటూ సర్‌ప్రైజ్‌ చేస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ ఆయన బాగా నటించాడు. ఇక ఆయనకు జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా బాగా చేసింది. ఆమెకి మంచి ప్రయారిటీ దక్కింది. ఆండ్రియా పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టింది. ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది. అలాగే శ్యామ్‌ కూడా చాలా రోజుల తర్వాత పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చేశాడు. లాల్‌ సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. వీటీవీ గణేష్‌ పాత్ర అలరిస్తుంది. ప్రభాకర్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

సాల్ట్ స్మగ్లింగ్ వెనుక అసలు కథేంటి?

టెక్నీకల్‌గా మూవీ సాలిడ్‌గా ఉంది. జిబ్రాన్ సంగీతం అదిరిపోయింది. బీజీఎం ఇరగదీశాడు. అదే సినిమాని నిలబెట్టింది. మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఎస్‌. వెంకటేష్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ గా ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్‌ సినిమాకి మరో ప్లస్‌. చాలా లేయర్లు, ట్విస్ట్ లు ఉన్నా, వాటిని బాగా ఎడిటింగ్‌ చేశారు. బాగా నడిపించారు. నిర్మాణ విలువలకు కొదవలేదు. రిచ్‌గా తీశారు. దర్శకుడు దురై సెంథిల్‌ కుమార్‌ ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే తో మ్యాజిక్‌ చేశాడు.   బాగా రాసుకున్నారు. దర్శకుడే ఈ మూవీకి అసలైన హీరో అని చెప్పొచ్చు.

`లీడర్‌` మంచి యాక్షన్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌. చూస్తే కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు.

‘లీడర్’ మూవీ యాక్షన్ సీన్స్, ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. శరవణన్ నటన సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.