|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ దెబ్బకి వెనక్కి తగ్గిన అఖిల్ ‘లెనిన్’! విడుదల వాయిదా, కారణం ఇదే!

Published: 14-02-2026, 12:35 PM
రామ్ చరణ్ దెబ్బకి వెనక్కి తగ్గిన అఖిల్ 'లెనిన్'! విడుదల వాయిదా, కారణం ఇదే!
  • అఖిల్ హీరోగా ‘లెనిన్’ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉంది.
  • రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండటంతో ‘లెనిన్’ వాయిదా పడింది.
  • వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో విడుదల తేదీని మేకర్స్ వెల్లడించలేదు.
  • సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న ‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా పడింది. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 1న విడుదల కావాల్సిన ‘లెనిన్’ కొత్త విడుదల తేదీ కోసం ఎదురు చూడాల్సిందే.

‘లెనిన్’ సినిమా విడుదల వాయిదాకు కారణం?

Lenin Film: అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం లెనిన్(Lenin film). రాయలసీమ లవ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ జోడిగా భాగ్యశ్రీ (Bhagya Shri)హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి అని తెలుస్తుంది. గత ఏడాది ఈ సినిమాని విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని మే ఒకటో తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా కూడా తెలియజేశారు. ఈ విడుదల తేదీ నుంచి కూడా తప్పుకుందని తెలుస్తోంది.

మే ఒకటో తేదీ విడుదల కావలసిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 30వ తేదీ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా (Peddi Movie) విడుదల కాబోతున్న నేపథ్యంలో మే ఒకటో తేదీ విడుదల కావాల్సిన లెనిన్ విడుదల నుంచి తప్పుకుంది. నిజానికి రామ్ చరణ్ పెద్ది సినిమా మార్చి 27వ తేదీ విడుదల కావాల్సి ఉంది షూటింగ్ పనులు పూర్తికాని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కారణంగా పెద్ది వాయిదా పడుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. తాజాగా లెనిన్ వాయిదా పడుతుందని మేకర్స్ చెప్పకనే చెప్పేశారు.

నేడు వాలెంటైన్స్ డే కావడంతో ప్రతి ఒక్క సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ తెలియజేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అఖిల్ సినిమా నుంచి కూడా ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ లో విడుదల తేదీ లేకపోవడం గమనార్హం. ఇలా విడుదల తేదీ లేకుండా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడంతో లెనిన్ సినిమా వాయిదా పడిందని మేకర్స్ చెప్పకనే చెప్పేశారు. ఇలా మే ఒకటో తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటంతో కొత్త విడుదల తేది ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగ వంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వాలెంటైన్స్ డే పోస్టర్‌లో విడుదల తేదీ మిస్సింగ్!

Vennelalle untaadhi prema Vanne challethundhoi ee seema 😍🫶🏻

With love from Lenin & Bharathi ❤️ Wishing you all a very Happy Valentine’s Day! #LENIN 🔥 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @musicthaman @KishoreAbburu @NavinNooli @artkolla @leonbrittodp … pic.twitter.com/WuzmId7TA6

— Annapurna Studios (@AnnapurnaStdios) February 14, 2026

ఏ బ్యానర్లపై ‘లెనిన్’ సినిమా నిర్మాణం?

అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలం పూర్తి అవుతుంది అయినప్పటికీ ఈయన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అఖిల్ కూడా ధ్రుడ నిశ్చయంతో ఉన్నారు. అదే విధంగా నాగార్జున కూడా తన కొడుకుని ఇండస్ట్రీలో నిలబెట్టడం కోసం లెనిన్ సినిమా ద్వారా నిర్మాతగా రంగంలోకి దిగారనే చెప్పాలి. ఇక ఈ సినిమా విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు వ్యవహరిస్తున్నారని, ఎక్కడ తప్పులు దొర్లకుండా సినిమాని ముందుకు తీసుకు వస్తున్నారని నాగ వంశీ తెలియజేశారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ కు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. మరి లెనిన్ సినిమా అయ్యగారికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

మొత్తానికి మే 1న విడుదల కావాల్సిన లెనిన్ సినిమా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కోసం అఖిల్ అభిమానులు వేచి చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.