
నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం అత్యంత శుభప్రదం. ముఖ్యంగా పంచమ రోజు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ విశిష్టమైన పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తొలగి, సిరి సంపదలు చేకూరి, ధనప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
Key Points
నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే డబ్బుకు లోటు ఉండదు, అప్పులు తీరి సిరి సంపదలు కలుగుతాయి.
ఒక పళ్లెంలో ఉప్పు, కుంకుమ వేసి, దానిపై ప్రమిద పెట్టి బొట్లు పెట్టి పంచగవ్య దీపం వెలిగించాలి.
నవరాత్రుల్లోనే కాకుండా, ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ దీపం వెలిగించి శుభ ఫలితాలు పొందవచ్చు.
నవరాత్రుల్లో మహాలక్ష్మి ఆరాధన ప్రాముఖ్యత
నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈరోజు దేవి నవరాత్రుల్లో అయిదవ రోజు. అయిదవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
అదే విధంగా నవరాత్రుల్లో చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఈ పరిహారాలను పాటించడం వలన అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉండవచ్చు. మనకున్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి.
ప్రతి ఒక్కరూ సిరి సంపదల కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు, నిత్యం పనిలో నిమగ్నం అవుతూ ఉంటారు. మనకి కావాల్సిన సిరిసంపదలు లభించాలంటే అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి. ఇటువంటివి ప్రసాదించే తల్లి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా అమ్మవారిని కచ్చితంగా పూజించాలి.
అమ్మవారికి దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. పూల మాలతో, పూలతో అందంగా అలంకరించాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు అమ్మవారిని ప్రత్యేకించి పూజించడం మంచిది. ఆరాధించిన వారికి సకల శుభాలు కలుగుతాయి.
ఐశ్వర్య దీపం లేదా పంచగవ్య ఐశ్వర్య దీపం వెలిగించండి
అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులను పొందడానికి పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. ఒక పళ్లెంలో కొంచెం ఉప్పు వేసి, దానిపై కుంకుమ వేసి ఒక ప్రమిద పెట్టి, ఆ ప్రమిదకు బొట్లు పెట్టి దానిపై పంచగవ్య దీపం పెట్టి వత్తులు వేసి వెలిగించండి. అదే పంచగవ్య దీపం లేకపోతె మాములు ప్రమిదలో ఆవు నెయ్యి వేసి రెండు వత్తులు వేసి వెలిగించాలి. దాంతో పాటుగా మంగళకరమైన వస్తువులైన చిట్టి గాజులు, తామర గింజలు, వెండి పువ్వులు, లక్ష్మీ గవ్వలు ఇలాంటివి కూడా అమ్మవారి ఎదుట పెట్టండి.
పంచగవ్య దీపాన్ని వెలిగించడం వలన నిత్యం డబ్బు మీతో ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వచ్చిన డబ్బు వృథాగా పోకుండా ఉంటుంది. నవరాత్రుల్లోనే కాదు, ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ పంచగవ్య దీపాన్ని, ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీనితో అమ్మవారికి గులాబీ పూలను సమర్పిస్తే కూడా శుభ ఫలితాన్ని పొందవచ్చు. అదే విధంగా కనకధారా స్తోత్రాన్ని చదువుకుంటే కూడా శుభ ఫలితాలను పొందవచ్చు.
వందే వందారు మందారమిందిరానందకందలమ్
అమందానందసందోహ బంధురం సింధురాననమ్
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్..
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః
ముగ్ధా ముహుర్విదధతీ వదనేమురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని..
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం
ఆనందకందమనిమేషమనంగతంత్రమ్..
ఆకేకరస్థిత కనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి..
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః
కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
పంచగవ్య ఐశ్వర్య దీపం వెలిగించే విధానం
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ..
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన..
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః
విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోపి..
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే..
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే..
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశి శేఖర వల్లభేతి..
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై
శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై..
శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై
దీపం వెలిగించడం వల్ల కలిగే శుభ ఫలితాలు
నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై..
నమోస్తు శారంగాయుధవల్లభాయై
నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసిస్థితాయై..
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువనప్రసూత్యై..
నమోస్తు దేవాదిభిరర్చితాయై
సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి..
త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు నాన్యే
త్వాంమురారిహృదయేశ్వరీం భజే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్..
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథ-గృహిణీం-అమృతాబ్ధిపుత్రీమ్
కరుణాపూర తరంగితైర పాంగైః..
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్..
గుణాధికా గురుతర-భాగ్య-భాగినో
భవంతి తే భువి బుధభావితాశయాః
సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్..
నవరాత్రుల్లో మాత్రమే కాకుండా, ప్రతి మంగళ, శుక్రవారాల్లోనూ ఈ పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని వెలిగించి, అమ్మవారి అనుగ్రహం పొందడం ద్వారా ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఇలా నిరంతరం ఆరాధించడం వలన సుఖ సంతోషాలతో జీవితం కొనసాగుతుందని విశ్వాసం.


