
‘లిటిల్ హార్ట్స్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సాయి మార్తండ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని తన కలను పంచుకున్నారు. మహేష్ బాబుతో ఇప్పటివరకు చేయని భిన్నమైన ప్రేమకథా చిత్రాన్ని తీయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Key Points
సాయి మార్తండ్ ‘లిటిల్ హార్ట్స్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
మహేష్ బాబుతో సినిమా తీయడం తన కల అని సాయి మార్తండ్ తెలిపారు.
భిన్నమైన నేపథ్యంతో ప్రేమకథా చిత్రం చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
‘లిటిల్ హార్ట్స్’తో సాయి మార్తండ్ బ్లాక్ బస్టర్ హిట్
‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తండ్.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. మౌళి, శివాని నాగరం జంటగా నటించిన ఈ సినిమా అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద రూ. 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో డైరెక్టర్‌గా సాయి మార్తాండ్ పేరు ఇండస్ట్రీలో మారు మోగుతుంది. దీంతో ఈ డైరెక్టర్ నెక్ట్స్ ఎలాంటి మూవీస్ చెయ్య బోతున్నాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి మార్తండ్ తనకు మహేశ్ బాబుతో సినిమా తీయాలని ఉందని చెప్పుకొచ్చాడు. ‘నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో అభిమానం. ఏదో ఒక రోజు ఆయనతో సినిమా చేయడం నా కల. ఒకవేళ అవకాశం వస్తే.. మహేష్ బాబుతో పక్కా ప్రేమకథా చిత్రం తీయాలని ఉంది. అది కూడా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా, కొత్త నేపథ్యం మీద సాగేలా చేయాలనుకుంటున్న’ అని తెలిపాడు. ప్రస్తుతం సాయి మార్తాండ్ రెండు కొత్త సినిమాలపై పని చేస్తున్నారు. వాటిలో ఒకటి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
అంతా అనుకున్నట్లు జరిగితే.. ‘ఫౌజీ’ అండ్ NTRNeel రిలీజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
మహేష్ బాబుతో సినిమాపై దర్శకుడి కల
కొత్త ప్రేమకథా చిత్రంగా దర్శకుడి ఆలోచనలు
సాయి మార్తండ్ మహేష్ బాబుతో సరికొత్త ప్రేమకథను తెరకెక్కించాలనే ఆసక్తి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.


