|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Lokah Collection: మూడంకెల మార్క్ దాటేసిన ‘కొత్త లోక’

Published: 04-09-2025, 1:59 AM
Lokah Collection: మూడంకెల మార్క్ దాటేసిన 'కొత్త లోక'

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయం గురించి చర్చలు జరుగుతున్న సమయంలో ‘కొత్త లోక’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ సినిమా.. రూ.100 కోట్ల మార్క్ దాటింది.

Key Points

1

కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన 'కొత్త లోక' సినిమా

2

7 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించింది

4

మహానటి, రుద్రమదేవి, భాగమతి చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు

కొత్త లోక సినిమా విజయం

హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే చాలామంది ప్రేక్షకులకు చిన్నచూపు. హా ఏముందిలే అని అనుకుంటారు. కానీ అప్పట్లోనే విజయశాంతి లాంటి హీరోయిన్స్.. ‘కర్తవ్యం’ లాంటి సినిమాలు చేశారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తర్వాత కాలంలో హీరోలు, కమర్షియల్ చిత్రాల హవా పెరిగేసరికి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ రావడం బాగా తగ్గిపోయింది. కానీ గత దశాబ్ద కాలంలో మాత్రం దక్షిణాదిలో అడపాదడపా వస్తూనే ఉన్నాయి.

గత కొన్నేళ్లలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే అనుష్క గుర్తొస్తుంది. ‘అరుంధతి’తో ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్యూటీ.. తర్వాత రుద్రమదేవి, భాగమతి తదతరత చిత్రాలతో తన సకెస్స్‌ని కొనసాగించింది. తర్వాత కాలంలో పలువురు సౌత్ హీరోయిన్లు.. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తీసినప్పటికీ అనుష్క దరిదాపుల్లోకి చేరుకోలేకపోయారు. కానీ ‘మహానటి’ మూవీతో కీర్తి సురేశ్ ఆ ఫీట్ సాధించింది. ఈ మూవీకి ఏకంగా రూ.84 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.

కల్యాణి ప్రియదర్శన్ నటన

2018లో ‘మహానటి’ రాగా ఆ రికార్డ్ అలానే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ‘కొత్త లోక’ సినిమా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం.. రిలీజైన 7 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది. సాధారణంగా చూస్తే ఇదేమంత ఎక్కువ మొత్తంలా అనిపించకపోవచ్చు. కానీ మిడ్ రేంజ్ హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్‌ని లీడ్ రోల్‌లో పెట్టి తీసిన సూపర్ హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అంటే కచ్చితంగా విశేషమే.

ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల విజయం

ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన ‘కొత్త లోక’..  ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్ కూడా దాటేసినట్లు తెలుస్తోంది. తద్వారా మహానటి, రుద్రమదేవి, భాగమతి, అరుంధతి చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ఇది ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి?

చిన్న బడ్జెట్ తో నిర్మించబడిన ‘కొత్త లోక’ సినిమా భారీ విజయం సాధించింది. కల్యాణి ప్రియదర్శన్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.