|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంత: ఎవరో ఏదో అన్నారని ప్రశాంతత కోల్పోవద్దు.. చర్చనీయాంశంగా మారిన సమంత పోస్ట్

Published: 21-06-2025, 9:48 AM
సమంత: ఎవరో ఏదో అన్నారని ప్రశాంతత కోల్పోవద్దు.. చర్చనీయాంశంగా మారిన సమంత పోస్ట్

టాలీవుడ్ నటి సమంత తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రశాంతతను కాపాడుకోవడం గురించి ఆమె పంచుకున్న మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

సమంత తాజా పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం.

2

ప్రశాంతతను కాపాడుకోవడం గురించి ఆమె పోస్ట్‌లోని సందేశం.

4

ఆత్మగౌరవం, ప్రశాంతత, జీవితంపై ఆమె అభిప్రాయాలు.

సమంత యొక్క తాజా సోషల్ మీడియా పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక ఇటీవల మళ్లీ నిర్మాతగా మారి తన మొదటి చిత్రాన్ని నిర్మించిన ఆమె పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాల్లో నటించనప్పటికీ సమంత మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో డేటింగ్‌లో ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. సమంతపై వారికి రెండు మూడు వార్తలైనా వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఆమె పెట్టే పోస్టులు సైతం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తాయి. తాజాగా, సమంత పోస్ట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది.

అసలు ఈ సమయంలో ఆమె అలాంటి పోస్ట్ పెట్టడానికి కారణాలేంటని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. అసలు అందులో ఏముందంటే.. ‘‘ఇతరుల మాటలకు పట్టించుకోవద్దు. జీవితంలో ఏదైనా జరగనివ్వండి కానీ ప్రశాంతతను మాత్రం కోల్పోవద్దు. ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. ఆ ప్రశాంతత కోసం మనం ఎప్పుడూ సాధన చేస్తూనే ఉండాలి. ఎంజాయ్ చేయాలి కానీ దాంతో పోరాడకూడదు. జరిగే దాన్ని జరగనివవ్వాలి. నేను చేయాల్సింది అనుకునే బదులు.. తప్పకుండా చేయాల్సిందే అనేలా మైండ్‌ను మార్చుకోవాలి. మనం పెట్టుకునే లిమిట్స్ అన్ని మన ఆత్మగౌరవంలో భాగమే. నిశ్చలంగా ఉన్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అసలు మీ శక్తిని తీసుకునే హక్కు ఎవరికీ లేదు. గౌరవానికి ఒత్తిళ్లు ఎప్పుడూ అడ్డు కాకూడదు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ప్రశాంతతను కాపాడుకోవడంపై సమంత అభిప్రాయాలు

నెటిజన్ల స్పందన

సమంత పోస్ట్‌లోని సందేశం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంది. ప్రతికూలతలను ఎదుర్కొని ప్రశాంతంగా ఉండటం ఎంత ముఖ్యమో ఆమె చక్కగా వివరించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.