|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లోకేష్ కనకరాజు సంచలన నిజాలు! సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా?

Published: 17-03-2026, 9:05 PM
లోకేష్ కనకరాజు సంచలన నిజాలు! సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా?
  • లోకేష్ కనకరాజు కోలీవుడ్లో టాప్ డైరెక్టర్లలో ఒకరు.
  • సినిమాల్లోకి రాకముందు లోకేష్ ఒక బ్యాంకులో ఉద్యోగం చేసేవారు.
  • సందీప్ కిషన్ నటించిన ‘నగరం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.
  • ‘ఖైదీ’ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాక, ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గురించి ప్రస్తుతం ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు? సినీ రంగంలోకి ఎలా అడుగుపెట్టారు అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

లోకేష్ కనకరాజు సినీ ప్రస్థానం

Lokesh kanakaraj: కోలీవుడ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం.. ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఈయన ఒకరు.. దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం హీరోగా కూడా మారిన విషయం తెలిసిందే.. అయితే ఈ మధ్య ఈ డైరెక్టర్ గురించి రోజుకు వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ఈయన సినిమాల గురించి మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా నెటిజన్లు తెలుసుకునేందుకు తెగ ఆత్రుత కనబరుస్తున్నారు.. ఈమధ్య లోకేష్ కనకరాజు ఫ్యామిలీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.. తాజాగా ఆయన గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఇంతకీ ఈ డైరెక్టర్ సినిమాల్లోకి రాకముందు ఎలాంటి పని చేశాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. మరి ఆ డైరెక్టర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడో అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సినిమాల్లోకి రాకముందు లోకేష్ ఏం చేసేవారు?

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతోమంది స్టార్స్ గా ఎదిగారు. అలాంటి వారిలో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా ఒకరు.. టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ హీరో గా నటించిన ‘నగరం’ అనే మూవీ ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత ఈ డైరెక్టర్ కి ఇటు టాలీవుడ్ లో కానీ, అటు కోలీవుడ్ లో కానీ ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. కొన్నేళ్ల పాటు ఆయన అవకాశాల కోసం ఎదురు చూశారు. అయితే డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు ఏం పని చేశారో అన్నది సస్పెన్స్ గా మారింది. బ్యాంక్ లో ఉద్యోగి గా కొనసాగే వాడు. ఈ కాలం లో బ్యాంక్ ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ జాబు ని వదిలేసి సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ తో ఇటుగా అడుగులు వేసి చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే రేంజ్కి ఆయన ఎదిగాడు అని చెప్పడంలో సందేహం లేదు.

ఖైదీ సినిమాతో వచ్చిన గుర్తింపు

మంచి జాబ్ ని వదులుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా తనకి అవకాశాలు ఇవ్వలేదు. అలాంటి సమయం లో ఈయన తమిళ డైరెక్టర్ కార్తీ తో కలిసి చేసిన ‘ఖైదీ’ చిత్రం కమర్షియల్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ఆ మూవీ తర్వాత ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు తలుపు తడ్డాయి. ఇప్పుడు ఈ క్రేజ్ డైరెక్టర్ తో ఒక్క సినిమా చేయడానికి ఇండియా లోని ప్రతీ సూపర్ స్టార్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. అటు రజనీకాంత్ తో పాటుగా మిగిలిన స్టార్ హీరోలు అందరితోనూ ఆయన సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు తెలుగు హీరోలతో కూడా సినిమాలు చేయబోతున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమాల గురించి ప్రకటించే అవకాశం ఉంది.

బ్యాంక్ ఉద్యోగం వదులుకొని సినిమా రంగంపై మక్కువతో ఎన్నో కష్టాలు పడ్డారు లోకేష్. నేడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.