|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లోకేష్ కనగరాజ్: రజినీకాంత్, కమల్‌హాసన్ కాంబో.. ఆసక్తికర అప్‌డేట్

Published: 11-05-2025, 6:16 PM
లోకేష్ కనగరాజ్: రజినీకాంత్, కమల్‌హాసన్ కాంబో.. ఆసక్తికర అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజా ఇంటర్వ్యూలో రజినీకాంత్, కమల్ హాసన్ కాంబో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రెండు వృద్ధ గ్యాంగ్‌స్టర్ల కథాంశంతో ఈ సినిమా ఉండనుందని తెలిపారు.

Key Points

1

లోకేష్ కనగరాజ్ రజినీకాంత్, కమల్ హాసన్ కాంబో సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

2

రెండు వృద్ధ గ్యాంగ్‌స్టర్ల కథాంశంతో ఈ మల్టీస్టారర్ సినిమా ఉంటుందని తెలిపారు.

4

'కూలీ' తర్వాత 'ఖైదీ 2', 'విక్రమ్ 2' చిత్రాలపై దృష్టి సారించనున్నట్లు లోకేష్ తెలిపారు.

రజినీ, కమల్ కాంబో సినిమాపై లోకేష్ కామెంట్స్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్‌(Rajinikanth)తో ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

వృద్ధ గ్యాంగ్‌స్టర్ల కథాంశం

‘కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ చేయాలని గతంలో అనుకున్నాను. ఇది ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌కు సంబంధించిన కథ. కలమ్ అండ్ రజనీకి స్క్రిప్ట్ కూడా చెప్తే ఓకే అన్నారు. హీరోగా రజనీకాంత్.. ప్రొడ్యూసర్‌గా కమల్ హాసన్ (Kamal Haasan).. నేను డైరెక్టర్ ఇదే ప్లాన్. అయితే.. ‘విక్రమ్’, ‘జైలర్’ తర్వాత వాళ్ల మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడున్న రోజుల్లో ఆ ప్రాజెక్ట్ సిద్ధం చేయడం అవుతుందో లేదో చూడాలి. వాళ్ల ఉత్సహంగా ఉంటే ఇప్పుడు తెరకెక్కించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ‘కూలీ’ చిత్రం తర్వాత ఆయన కార్తీ ‘ఖైదీ-2’పై ఫోకస్ పెట్టనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ‘విక్రమ్-2’. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక రజినీ, కమల్ కాంబో తెరకెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

లోకేష్ కనగరాజ్ తదుపరి ప్రాజెక్టులు

#Rajinikanth & #KamalHassan — directed by Lokesh 🥶🙏🔥 [Multistarrer] “I’ve narrated a story to both Kamal Haasan and Rajinikanth sir about two aged gangsters. They were both excited, and we’re close to finalizing the project.” – #LokeshKanagaraj pic.twitter.com/hXhHIunWEX

ప్రస్తుతం లోకేష్ ‘కూలీ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’ తర్వాతే రజినీ-కమల్ కాంబో సినిమాకు అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఈ కాంబో సినిమాను చూడటానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.