|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్రేజీ బజ్.. పవన్ కల్యాణ్‌తో కాదు అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ తొలి తెలుగు మూవీ.. కథ కూడా విన్న ఐకాన్ స్టార్!

Published: 30-11-2025, 12:26 AM
క్రేజీ బజ్.. పవన్ కల్యాణ్‌తో కాదు అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ తొలి తెలుగు మూవీ.. కథ కూడా విన్న ఐకాన్ స్టార్!
  • లోకేష్ కనగరాజ్ తొలి తెలుగు మూవీ అల్లు అర్జున్‌తోనే అని బజ్.
  • పవన్ కల్యాణ్‌తో కాకుండా అల్లు అర్జున్‌తో సినిమా అంటున్నారు.
  • అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు.
  • ప్రస్తుతం బన్నీ అట్లీ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.

తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన తొలి తెలుగు చిత్రాన్ని పవన్ కల్యాణ్‌తో కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. బన్నీ ఇప్పటికే కథ విని, సినిమాకు ఓకే చెప్పినట్లు తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

లోకేష్ కనగరాజ్ తెలుగు ఎంట్రీ

అల్లు అర్జున్ మరో తమిళ డైరెక్టర్ తో చేతులు కలపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అట్లీతో మూవీతో తర్వాత మరో స్టార్ తమిళ డైెరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో బన్నీ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని, ఇప్పటికే కథ కూడా విన్నాడని తమిళ మీడియా చెబుతోంది.

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం హీరోగా మారుతున్నాడు. అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డీసీ’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈలోపే అతడు నెక్ట్స్ డైరెక్ట్ చేయబోయే సినిమాపై క్రేజీ బజ్ నెలకొంది. తెలుగులో అతడు అల్లు అర్జున్ తో తన తొలి సినిమా చేస్తున్నాడని తమిళ మీడియా చెబుతుండటం విశేషం.

అల్లు అర్జున్ తోనే ఎందుకు?

లోకేష్ కథ విన్న అల్లు అర్జున్

ఆ కథ అల్లు అర్జున్‌కు కూడా బాగా నచ్చడంతో.. అతని డైరెక్షన్ లో నటించడం ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ డైరెక్టరే అయిన అట్లీ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియాలో మూవీలో నటిస్తున్నాడు. అందులో దీపికా పదుకోన్ కూడా నటిస్తోంది. ఆ తర్వాత బన్నీ ఎవరితో మూవీ చేస్తాడన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేకపోగా.. లోకేష్ కనగరాజ్ పేరు తెరపైకి రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుత ప్రాజెక్ట్స్

లోకేష్ కనగరాజ్.. నెక్ట్స్ ఏంటి?

దీంతో లోకేష్ నెక్ట్స్ మూవీపై ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ తో మూవీ కోసం అతని టీమ్ తో లోకేష్ చర్చలు జరుపుతున్నట్లు తమిళ మీడియా చెబుతోంది. లోకేష్ కెరీర్లో ఆరు సినిమాలు తీయగా.. కూలీ మినహా మిగిలిన వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో అతని నెక్ట్స్ మూవీ ఏంటి? ఎవరితో అన్న చర్చ జోరుగా నడుస్తోంది. దీనిపై అతడు త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

లోకేష్ కనగరాజ్, అల్లు అర్జున్ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది నిజమైతే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.