|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా రన్ టైమ్ వెనుక అసలు రహస్యం! ప్రేక్షకులు కోరుకునేది అదేనా?

Published: 23-02-2026, 12:35 AM
సినిమా రన్ టైమ్ వెనుక అసలు రహస్యం! ప్రేక్షకులు కోరుకునేది అదేనా?
  • నేటి ప్రేక్షకులు థియేటర్‌లో లార్జర్ దన్ లైఫ్ అనుభూతిని కోరుకుంటున్నారు.
  • భారీ సెట్టింగులు, ఎమోషనల్ డెప్త్ ఉంటే సినిమా నిడివి పెరుగుతుంది.
  • ఆర్ఆర్ఆర్, పుష్ప, యానిమల్ వంటి సినిమాలు దాదాపు మూడు గంటల నిడివి కలిగి ఉన్నాయి.
  • మల్టీప్లెక్స్‌లో టికెట్, పాప్‌కార్న్ ఖర్చుల వల్ల ప్రేక్షకులు ఎక్కువ వినోదం కోరుకుంటున్నారు.

ఈ రోజుల్లో సినిమా నిడివి ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్‌లో ఒక లార్జర్ దన్ లైఫ్ అనుభూతిని కోరుకుంటున్నారు. భారీ సెట్టింగులు, ఎమోషనల్ డెప్త్ ఉంటే సినిమా నిడివి పెరుగుతుంది.

సినిమా నిడివి పెరగడానికి కారణాలు

Long Runtime: ఈ రోజుల్లో సినిమా నిడివి (Runtime) అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రెండు గంటల సినిమా అంటే ‘క్రిస్పీగా’ ఉందని ప్రేక్షకులు ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. “సినిమా మూడు గంటలు ఉంటేనే పైసా వసూల్” అనే ధోరణి కనిపిస్తోంది. దీని వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. అందుకు తగ్గట్టుగా పాన్ ఇండియా సినిమాలు కూడా దాదాపు మూడు గంటల నిడివి ప్లాన్ చేసుకుంటున్నాయి.

Read also- Jai Hanuman: ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్‌లోకి ఆస్కార్ విజేత.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీం..

ఓటీటీ ప్రభావం, థియేటర్ అనుభూతి

నేటి ప్రేక్షకులు కేవలం కథ కోసం థియేటర్‌కు రావడం లేదు. ఓటీటీ (OTT) పుణ్యమా అని ఇంట్లోనే బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉంది. థియేటర్‌కు వెళ్లినప్పుడు వారు ఒక ‘లార్జర్ దన్ లైఫ్’ (Larger than life) అనుభూతిని కోరుకుంటున్నారు. భారీ సెట్టింగులు, ఎమోషనల్ డెప్త్, గ్రాండియర్ ఉన్నప్పుడు ఆ కథను చెప్పడానికి సహజంగానే ఎక్కువ సమయం పడుతుంది. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు గమనిస్తే.. ఆర్ఆర్ఆర్ (RRR), పుష్ప, యానిమల్, లేదా మొన్నటి కల్కి 2898 AD వంటివన్నీ దాదాపు మూడు గంటల నిడివి ఉన్నవే. కథలో పాత్రల మధ్య ఎమోషన్ బలంగా పండాలంటే దర్శకుడికి సమయం పడుతుంది కావున సినిమా మూడు గంటలు ఉండాల్సి వస్తుంది. ఒక కొత్త ప్రపంచాన్ని చూపించేటప్పుడు (ఉదాహరణకు ఫాంటసీ లేదా పీరియడ్ డ్రామా) ఆ వివరాలు చూపించడంలో నిడివి పెరుగుతుంది.

Read also- One Battle After Another on OTT : లియోనార్డో డికాప్రియో బ్లాక్ కామెడీ యాక్షన్ చిత్రం ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

ప్రేక్షకుల మనోభావాలు, ఖర్చుల చిక్కులు

రెండు గంటల సినిమాలు ఆడకపోవడానికి కంటెంట్ లోపం కూడా ఒక ప్రధాన కారణమే. చాలా చిన్న సినిమాలు లేదా థ్రిల్లర్లు రెండు గంటల్లో ముగుస్తాయి. కానీ వాటిలో థియేటర్లో చూడదగ్గ ‘హై’ ఇచ్చే అంశాలు తక్కువగా ఉంటున్నాయి. ప్రేక్షకులు “ఇది ఓటీటీలో చూసుకోవచ్చులే” అని భావించడం వల్ల చిన్న నిడివి ఉన్న సినిమాలకు ఆదరణ తగ్గుతోంది. దింతో పాటుగా.. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు, పాప్‌కార్న్ ఖర్చులు చూస్తే ఒక సామాన్య ప్రేక్షకుడికి సినిమా చూడటం అనేది ఒక ఖరీదైన వ్యవహారం. “వందల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు, కనీసం రెండున్నర నుండి మూడు గంటల వినోదం ఉండాలి” అనే మానసిక స్థితికి ప్రేక్షకులు వచ్చేశారు. సినిమా చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదు, అది ప్రేక్షకుడిని ఎంతవరకు సీటులో కూర్చోబెట్టింది అన్నదే ముఖ్యం. సందీప్ రెడ్డి వంగా అన్నట్టు, కంటెంట్ బలంగా ఉన్నప్పుడు మూడు గంటలైనా ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరు. అదే కంటెంట్ లేనప్పుడు గంటన్నర సినిమా కూడా భారంగానే అనిపిస్తుంది. అయితే, ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మాత్రం “ఎపిక్ ఫీల్” ఇచ్చే లాంగ్ రన్‌టైమ్ సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ధోరని ఏమైనా మారుతుందో లేదో చూడాలి మరి.

మొత్తానికి, ప్రేక్షకులు థియేటర్లలో ఎక్కువ వినోదం ఆశిస్తున్నారు. సినిమా అనుభవం ఖరీదైనది కావడంతో, వారు తమ డబ్బుకు తగిన విలువను పొందాలని కోరుకుంటున్నారు. దీని కారణంగానే సినిమా నిడివి పెరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.