
నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ డేటింగ్ షో లవ్ ఈజ్ బ్లైండ్ తిరిగి వస్తోంది! సీజన్ 9, 32 మంది సింగిల్స్‌తో, అక్టోబర్ 1, 2025 నుండి ప్రసారమవుతుంది. కొలరాడోలోని డెన్వర్‌లో చిత్రీకరించబడిన ఈ సీజన్‌లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి.
Key Points
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 9 అక్టోబర్ 1, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.
32 మంది సింగిల్స్ తమ ప్రేమను వెతుకుతారు.
వీక్లీ బ్యాచ్‌లలో ఎపిసోడ్‌లు విడుదల అవుతాయి.
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 9 విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి సూపర్ హిట్ రియాలిటీ డేటింగ్ షో ‘లవ్ ఈజ్ బ్లైండ్’ కొత్త సీజన్ తో తిరిగి రాబోతోంది. ఈ లవ్, రొమాంటిక్ షో సీజన్ 9 స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సీజన్ 9లో 32 మంది సింగిల్స్ లవ్, రొమాన్స్ ను వెతుక్కుంటారు. ఈ సూపర్ హిట్ డేటింగ్ షో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.
డేటింగ్ రియాలిటీ షో లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 9 ఓటీటీ లోకి రాబోతుంది. అక్టోబర్ 1, 2025 నుంచి ఈ కొత్త సీజన్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సారి కొలరాడోలోని డెన్వర్‌లో సెట్ చేసిన ప్లేస్ లో డేటింగ్ షో లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 9 సాగుతుంది. అక్టోబర్ 1, 2025న ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సీజన్ అడుగుపెడుతుంది. ఆ తర్వాత ప్రతి బుధవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్అవుతుంది. గత సీజన్‌లన్నీ కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి.
డేటింగ్ షో ఓటీటీ షెడ్యూల్
32 మంది సింగిల్స్ యొక్క ప్రేమ వెతుకులాట
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 9 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో వీక్లీ బ్యాచ్ ల్లో విడుదల అవుతుంది. అక్టోబర్ 1న ఎపిసోడ్ 1 నుంచి 6 వరకు స్ట్రీమింగ్ కు వస్తాయి. అక్టోబర్ 8 న 7 నుంచి 9 ఎపిసోడ్‌లు, అక్టోబర్ 15 న 10 నుంచి 11 ఎపిసోడ్‌లు, అక్టోబర్ 22న 12వ ఎపిసోడ్ (ఫైనల్) ఓటీటీలోకి వస్తాయి. మునుపటి సీజన్‌ల మాదిరిగానే, పోటీదారులు పాడ్‌ల లోపల కనిపించని దృశ్యాలతో డేటింగ్ చేస్తారు. ఎమోషనల్ బాండింగ్ ఏర్పర్చుకుంటారు. ముఖాలను చూసుకోక ముందే ఎంగేజ్ అవుతారు. సీజన్‌లో జంటలు కలిసి జీవిస్తాయి. వివాహాలను ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంది.
ఈ సీజన్‌లో 27 నుండి 41 సంవత్సరాల వయస్సు గల 32 మంది కొత్త సింగిల్స్‌ను పరిచయం చేస్తున్నారు. వారు తమ ప్రేమ జీవితాలను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో ఛాంపియన్‌షిప్ పోకర్ ప్లేయర్, ఒంటరి తండ్రి, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుడు, మాజీ కొవిడ్ సంక్షోభ నర్సు లంటి అనేక మంది సృజనాత్మక వ్యక్తులు, వ్యవస్థాపకులు ఉన్నారు. పోటీదారులలో అలీ, నర్స్ ఆష్లే, డైరెక్టర్ ఆఫ్ కంప్లైయన్స్ చైనా, మార్కెటింగ్ మేనేజర్ హిల్లరీ, మెడికల్ డివైస్ సేల్స్ మైఖేల్, మెడికల్ సేల్స్ నిక్, లగ్జరీ వాచ్ డీలర్ రోహన్ లాంటి వాళ్లు ప్రేమను కనుగొనాలని ఆశిస్తున్నారు.
షో యొక్క ప్రత్యేకతలు
ఈ సీజన్‌లో కొత్తగా ఏముంది?
నిక్, వెనెస్సా లాచీ హోస్ట్ చేసిన ఈ 12-ఎపిసోడ్‌ల లైవ్ ఈజ్ బ్లైండ్ డేటింగ్ షో సీజన్ 9 లో డ్రామా, రొమాన్స్ , లవ్, బ్రేకప్ లు చాలానే ఉంటాయని తెలిసింది. జోడీల మధ్య లవ్ ఏర్పడి, అది రొమాన్స్ కు దారి తీస్తుందని అంటున్నారు. మరి చివరకు ఈ లవ్ పెయిర్స్ అలాగే ఉంటాయా? లేదా హార్ట్ బ్రేకింగ్ తప్పదా? అన్నది సీజన్ చూసి తెలుసుకోవాల్సిందే.
అక్టోబర్ 1, 2025 నుండి ప్రారంభమయ్యే లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 9, ప్రేమ కోసం వెతుకుతున్న 32 మంది సింగిల్స్ జీవితాలను ఎలా మారుస్తుందో చూడటానికి సిద్ధంగా ఉండండి.


