
📌 Key Points
- ‘హార్ట్‌లీ బ్యాటరీ’ తమిళ వెబ్ సిరీస్ నేడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
- ఇదొక రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది.
- ప్రేమను కొలిచే లవ్ మీటర్ చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది.
- లవ్ మీటర్ కారణంగా జరిగిన ఆత్మహత్య, అసలు ప్రేమపై ప్రశ్నలు.
ప్రేమను కొలిచే ఓ వినూత్న ‘లవ్ మీటర్’ కాన్సెప్ట్‌తో ‘హార్ట్‌లీ బ్యాటరీ’ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవాళ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ తమిళ సిరీస్ వివరాలు తెలుసుకుందాం.
‘హార్ట్‌లీ బ్యాటరీ’: కథేంటి?
ఇవాళ ఓటీటీలోకి ఓ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఓ రొమాంటిక్ థ్రిల్లర వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. లవ్ కొలిచే మీటర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ సిరీస్ ఏంటో చూసేయండి.
డిఫరెంట్ స్టోరీ, కాన్సెప్ట్ తో సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి వస్తున్నాయి. డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా విభిన్నమైన కథాంశంతో ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టింది. అదే.. ‘హార్ట్‌లీ బ్యాటరీ’. ఈ తమిళ సిరీస్ ఇవాళ (డిసెంబర్ 16) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదో రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.
లవ్ మీటర్ తో కొత్త కాన్సెప్ట్
హార్ట్‌లీ బ్యాటరీ స్టోరీ
చివరికి ఊహించని ట్విస్ట్
మరోవైపు సిద్ ఓ రైటర్. సోఫియాను చూసి ఇష్టపడతాడు. 12 గంటల్లో ప్రేమలో పడేయకపోతే సోఫియాకు కనిపించను అని చెబుతాడు. ఇక లవ్ మీటర్ తో చెక్ చేసుకుంటే సోఫియాకు కూడా ప్రేమ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ సోఫియా ఫ్రెండ్ ఈ లవ్ మీటర్ కారణంగా సూసైడ్ చేసుకుంటుంది. అక్కడి నుంచి స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ప్రేమను కొలవాలంటే ఓ యంత్రం సరిపోతుంది? మిషన్ ను దాటి నిజమైన ప్రేమను అందించలేరా? అనే ప్రశ్నలకు ఈ సిరీస్ లో సమాధానం దొరుకుతుంది.
ప్రేమను కొలిచే యంత్రాలు నిజమైన ప్రేమను నిర్ణయించలేవని, ఊహించని మలుపులతో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ‘హార్ట్‌లీ బ్యాటరీ’ డిజిటల్ ఆడియన్స్ ను అలరించడం ఖాయం.


