|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లక్కీ భాస్కర్ డైలాగులు: గుండెల్లో గుచ్చుకుపోయే మాటలు.. మర్చిపోలేరు!

Published: 16-12-2025, 4:04 AM
లక్కీ భాస్కర్ డైలాగులు: గుండెల్లో గుచ్చుకుపోయే మాటలు.. మర్చిపోలేరు!
  • జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అసంతృప్తులను ఎలా అధిగమించాలో తెలిపే డైలాగ్.
  • డబ్బు సంపాదన అవసరం నుంచి వ్యసనంగా మారే క్రమాన్ని విశ్లేషించే అద్భుతమైన మాటలు.
  • వేగంగా వచ్చే డబ్బు, దాని పర్యవసానాలపై లక్కీ భాస్కర్ అందించిన విలువైన సందేశం.
  • గెలుపు, ఓటమిపై సరికొత్త దృక్పథాన్ని ఇచ్చి, స్ఫూర్తిని నింపే శక్తివంతమైన డైలాగ్.

దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, జీవిత సత్యాలను బోధించే పాఠశాల. ఈ చిత్రంలోని ప్రతీ డైలాగ్ మనసులో నాటుకుపోయి, జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. డబ్బు, విజయం, ఓటమిపై స్పూర్తినిచ్చే మాటలు ఇక్కడ చూడండి.

లక్కీ భాస్కర్: స్ఫూర్తినిచ్చే డైలాగులు

‘రోజులో ఒక అర‌గంట నాకు న‌చ్చిన‌ట్లు గ‌డ‌వ‌లేదు. దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను క‌దా’. ల‌క్కీ భాస్క‌ర్ మూవీలో ది బెస్ట్ డైలాగ్స్‌లో ఇదీ ఒక‌టి. భాస్క‌ర్ ఉద్యోగం చేసే బ్యాంకులో ప్ర‌మోష‌న్ ఆశించి బంగ‌ప‌డి, ఆపై అవ‌మానాలు ఎదుర్కొన్న స‌మ‌యంలో వ‌చ్చే డైలాగ్ ఇది. నిజానికి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండ‌దు. మ‌న‌కు న‌చ్చ‌ని సంద‌ర్భాలు కూడా ఉంటాయి. అలాఅని వాటినే ప‌ట్టుకొని కూర్చుంటే జీవితంలో ముందుకు సాగ‌డం క‌ష్టం. అందుకే మ‌న‌కు న‌చ్చ‌ని సంద‌ర్భాల‌ను లైట్ తీసుకుంటూ ముందుకు సాగ‌డ‌మే జీవితం.

డ‌బ్బు చుట్టే తిరిగే ల‌క్కీ భాస్క‌ర్ సినిమాలో.. మ‌నీకి సంబంధించి ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. వాటిలో ఒక‌టి ‘డ‌బ్బు సంపాద‌న నీకు ఒక‌ప్పుడు అవ‌స‌రం, కానీ ఇప్పుడు ఒక వ్య‌స‌నం’. హీరో తండ్రి హీరోకు చెప్పే ఈ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. డ‌బ్బుపై ఎంత వ‌ర‌కు వ్యామోహం పెంచుకోవాలి అనే గొప్ప సందేశం ఈ డైలాగ్‌లో ఉంటుంది. చాలా మంది బ‌త‌కడానికి డ‌బ్బు కావాలి అని అనుకుంటారు. కానీ డ‌బ్బు సంపాద‌న మొద‌లయ్యాక అస‌లు రూపం బ‌య‌ట‌ప‌డుతుంది.

డబ్బుపై సినిమా సందేశం

ఇక ఈ సినిమాలో మ‌రో బెస్ట్ డైలాగ్‌.. ‘వేగంగా వెళ్లే బండి, వేగంగా వ‌చ్చే రూపాయి రెండూ.. మ‌నిషిని ఏదో ఒక రోజు కింద‌ప‌డేస్తాయి’. డ‌బ్బు మ‌న‌కు ఎంత సౌక‌ర్యాన్ని ఇస్తుందో అంతే క‌ష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంద‌నే సందేశం ఇందులో ఉంది. మ‌రీ ముఖ్యంగా ఈజీ మ‌నీ మ‌నిషి ప‌త‌నానికి నాంది ప‌లుకుతుంది. అందుకే.. ప‌రిగెత్తి పాలు తాగేకంటే, నిల‌బ‌డి నీళ్లు తాగ‌డం మంచిద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు.

‘గెలిచి ఓడితే ఆ ఓట‌మే గుర్తుంటుంది. అదే ఓడి గెలిస్తే ఆ గెలుపు చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. ఎందుకంటే చ‌రిత్ర ఎప్పుడు నువ్వు చివ‌రికి ఏం సాధించావు అన్న‌దే గుర్తుంచుకుంటుంది’. జీవితానికి స‌రిప‌డే సందేశం ఈ చిన్న డైలాగ్‌లో ఉంది. మ‌న‌లో కూడా చాలా మంది ఓట‌మి రాగానే కుంగిపోతారు. కెరీర్ మొద‌ట్లోనే ఏదో సాధించాల‌ని అనుకుంటారు. అనుకున్న‌ది సాధించ‌క‌పోయే స‌రికి బాధ‌ప‌డుతుంటారు. కానీ నిజ‌మైన విజ‌యం, ఓటమి త‌ర్వాతే వ‌స్తుంది.

ఓటమి, గెలుపుపై అద్భుతమైన మాటలు

సినిమాలో దుల్కర్ సల్మన్, రాంకీల మధ్య వచ్చే…‘థాంక్యూ సార్‌, న‌మ్మినందుకు.. మీకు కూడా థాంక్యూ సార్ నిలబెట్టుకున్నందుకు’. అనే డైలాగ్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. నిజానికి రాంకీ చెప్పిన ఐడియాను న‌మ్మి దుల్క‌ర్ స‌ల్మ‌న్ డ‌బ్బు ఇవ్వ‌డం ఎంత గొప్ప విష‌య‌మో, అదే విధంగా న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్న రాంకీ గొప్ప‌త‌నం కూడా ఇందులో ఉంది. జీవితంలో మ‌న‌ల్ని న‌మ్మిన వ్య‌క్తుల న‌మ్మ‌కాన్ని నిలబెట్ట‌డం ఎంత ముఖ్య‌మైన విష‌య‌మో ఈ డైలాగ్ చెబుతుంది.

లక్కీ భాస్కర్ డైలాగులు కేవలం వినడానికి మాత్రమే కాదు, జీవితంలో ఆచరించడానికి కూడా పనికొస్తాయి. ప్రతీ డైలాగ్ లోతుగా ఆలోచింపజేసే సందేశాన్ని కలిగి ఉంది, మనల్ని మరింత దృఢంగా నిలబడేలా చేస్తుంది. ఈ మాటలు ఎప్పటికీ మర్చిపోలేనివి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.