|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాన్స్ 2025లో తెలుగు సినిమా సంచలనం.. రెడ్‌ కార్పెట్‌ స్క్రీనింగ్‌, ఎం4ఎం మూవీ

Published: 20-05-2025, 10:59 AM
కాన్స్ 2025లో తెలుగు సినిమా సంచలనం.. రెడ్‌ కార్పెట్‌ స్క్రీనింగ్‌, ఎం4ఎం మూవీ

ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు సినిమా ‘ఎం4ఎం’ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్‌తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ సినిమాకు దర్శకుడు మోహన్ వడ్లపట్ల, నటి జో శర్మ హాజరయ్యారు.

Key Points

1

కాన్స్ 2025లో 'ఎం4ఎం' సినిమా రెడ్ కార్పెట్ స్క్రీనింగ్.

2

జో శర్మ, మోహన్ వడ్లపట్ల ప్రత్యేక హాజరు.

4

తెలుగు సినిమాకు కాన్స్‌లో అరుదైన గౌరవం.

‘ఎం4ఎం’ కాన్స్‌లో ప్రవేశం

ఆస్కార్‌ అవార్డుల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫెస్టివల్‌ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల. ఫ్రాన్స్ వేదికగా ఈ వేడుక జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సినిమా తారలు ఇందులో సందడిచేస్తారు. హీరోయిన్లు తమదైన ట్రెండీ, ట్రెడిషన్‌ వేర్స్‌ తో రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేస్తూ ఆకట్టుకుంటారు. పలు సినిమా టీమ్‌లు సైతం ఇందులో పాల్గొంటాయి. ఆయా సినిమాలు కాన్స్ లో ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ జరుపుతుంటాయి. వీటికి అవార్డులు కూడా ఉంటాయి. అయితే ఈ సారి తెలుగు సినిమా కాన్స్ లో సందడి చేసింది.

ఈ క్రమంలో మన తెలుగు నుంచి కాన్స్ లో స్క్రీనింగ్‌ అయిన సినిమాలు లేవు. ఇప్పుడు ఒక చిన్న సినిమా సంచలనం సృష్టించింది. `ఎం4ఎం`(మోటివ్‌ ఫర్‌ మర్డర్‌) అనే మూవీ కాన్స్ లో స్క్రీనింగ్‌ కావడం విశేషం. ఇలా 2025 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన తెలుగు సినిమా మ‌న ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. జో వర్మ నటించిన మోహన్ వడ్లపట్ల రూపొందించిన ‘ఎం4ఎం’ మూవీ కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్‌లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

రెడ్ కార్పెట్ గ్రాండ్ ఎంట్రీ

తెలుగు చిత్రసీమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్లతో పాటు అమెరికాకు చెందిన నటి జో శర్మ గౌరవంగా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు హర్షధ్వనాలు చేయడంతో పాటు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇది తెలుగు సినిమాకు కాన్స్‌లో దక్కిన అరుదైన ఘనత.

ఇటీవల అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందుతున్న జో శర్మ, ఈ ఈవెంట్‌లో దుబాయ్, ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, నటనా ప్రతిభకు అక్కడి మీడియా ప్రశంసలు కురిపించింది.

అంతర్జాతీయ ప్రశంసలు

మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్‌విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన` M4M` కేన్స్ 2025లో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం కావడం విశేషం. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథన బలంతో పాటు సినిమాటిక్ ప్రెజెంటేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకు కాన్స్‌లో ఊరిస్తున్న ఈ అరుదైన గౌర‌వం, M4M మూవీకి ద‌క్క‌డంతో ఈ ప్రీమియర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో గొప్ప ఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాతగా మంచి గుర్తింపు ఉన్న‌ మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జో శర్మ అభినయం ప్రపంచ స్థాయిలో ప్రశంసలందుకుంది. త్వరలో ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

కాన్స్‌లో ‘ఎం4ఎం’ విజయం తెలుగు సినిమాకు ఒక గొప్ప మైలురాయి. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.