
📌 Key Points
- సమంత నిర్మాతగా మారి ‘మా ఇంటి బంగారం’ మూవీతో మరో సంచలనం!
- మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ‘మా ఇంటి బంగారం’!
- భర్త రాజ్ నిడుమోరు కథ, నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం!
- టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన ఫ్యామిలీ ఎమోషన్స్ చిత్రం!
స్టార్ బ్యూటీ సమంత నిర్మాతగా మారి ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మూవీ టీజర్ కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
సమంత ప్రొడక్షన్ నెం-2 అదుర్స్!
స్టార్ బ్యూటీ సమంత.. ప్రజెంట్ నిర్మాతగా, హీరోయిన్‌గా రాణిస్తూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ తన ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం-2గా ‘మా ఇంటి బంగారం’చిత్రాన్ని తీసుకొస్తుంది. ఇటీవల దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సమంత స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘మా ఇంటి బంగారం మీ అభిమాన థియేటర్లలో.. మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది’ అంటూ తెలిపారు. కాగా.. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా.. మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తు్న్నారు. ఇక ఇప్పటికే ఇందులోనుంచి వచ్చిన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు వినోదాన్ని మేళవించిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంతే కాకుండా.. చాలా గ్యాప్ తర్వాత సమంత ఫుల్ రోల్ చేస్తుండగా.. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
మే 15న గ్రాండ్ రిలీజ్ అంటోన్న సమంత!
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సమంత!
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


