|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Maa Trailer: కాజోల్‌ హారర్ థ్రిల్లర్‌.. భయపెడుతోన్న ట్రైలర్!

Published: 29-05-2025, 6:50 AM
Maa Trailer: కాజోల్‌ హారర్ థ్రిల్లర్‌.. భయపెడుతోన్న ట్రైలర్!

బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌లోని దెయ్యం దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Key Points

కాజోల్ హారర్ థ్రిల్లర్‌లో

బాలీవుడ్ భామ కాజోల్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం‌ మా(Maa Movie). ఈ సినిమాకు విశాల్ రేవంతి ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తే ఈ మూవీ హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో దెయ్యం సీన్స్‌ ఆడియన్స్‌కు వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నయి. ట్రైలర్‌ ఆద్యంతం ఆడియన్స్‌లో అత్యంత ఉత్కంఠ పెంచేలా ఉంది. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధమే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో తనూజ దేవ్‌గణ్‌, రోనిత్‌రాయ్‌, సుభద్ర సేన్‌గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ  పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

భయపెట్టే ట్రైలర్ విడుదల

జూన్ 27న థియేటర్లలో

కాజోల్ నటన, భయానక దృశ్యాలు, ఉత్కంఠభరిత కథాంశంతో ‘మా’ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 27 వరకు ఆసక్తిగా ఎదురు చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.