
ఆది పినిశెట్టి మరియు చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మయసభ’ అనే వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్ విడుదలైంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథలో ఇద్దరు మంచి స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారతారో చూపిస్తుంది.
Key Points
ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రధారులు.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘మయసభ’.
ఇద్దరు మంచి స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా మారిన కథ.
‘మయసభ’ వెబ్ సిరీస్ టీజర్ విడుదల
ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మయసభ’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సీరిస్‌కు దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ సోనీలివ్ ఒరిజినల్స్‌లో ఆగస్టు 7 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘అన్నా.. ఆర్జెంట్‌గా బయలుదేరి హైదరాబాద్ ఆశ్రమం హోటల్‌కు వచ్చేయ్.
పెద్దాయన రేపు పార్టీలో నుంచి సస్పెండ్ చేయబోయే 35 MLAల లిస్ట్‌లో నువ్వు కూడా ఉన్నావు’ అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో.. ‘ఏం జరుగుతోంది నాయుడు.. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేశావు.. ఫ్రెండ్ గానా, ప్రత్యర్థి గానా?’ అని చైతన్య రావు ఆది పినిశెట్టితో ఫోన్ మాట్లాడతాడు. ఆక ఆది.. ‘కురుక్షేత్రం.. ఇది చావో రేవో అర్థం కావడం లేదు రెడ్డి.. 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు.. స్నేహితుడిగా ఒక మాట చెప్పు.. ఈ ఉచ్చు నుంచి బయటపడతానా?’ అంటూ చెప్పిన ఆది డైలాగ్స్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక మంచి స్నేహితులు అయినా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుండగా.. టీజర్‌కు నెట్టింట మంచి స్పందన లభిస్తుంది. టీజర్
ఆది పినిశెట్టి, చైతన్య రావు నటన
రాజకీయ నేపథ్యం, స్నేహం, ప్రత్యర్థిత్వం
‘మయసభ’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాజకీయాల నేపథ్యంలో స్నేహం, ప్రత్యర్థిత్వం ఎలా ఉంటాయో చూపించే ఈ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. ఆగస్టు 7న సోనీలివ్‌లో విడుదల.


