|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sai Dharam Tej: బ్యాడ్‌ టైమ్‌లో నా వెంట ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే: సాయి ధరమ్ తేజ్

Published: 31-07-2025, 6:44 AM
Sai Dharam Tej: బ్యాడ్‌ టైమ్‌లో నా వెంట ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే: సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన 18వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా మయసభ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్, దేవా కట్టతో తన అనుబంధాన్ని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Key Points

1

సాయి ధరమ్ తేజ్ తన 18వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

2

మయసభ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్నారు.

4

కష్టకాలంలో దేవా కట్టే తనకు సహాయం చేశారని చెప్పారు.

సాయి ధరమ్ తేజ్‌ తాజా సినిమా

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ( సాయి దుర్గ తేజ్ ) విరూపాక్ష , బ్రో చిత్రాల తర్వాత గతేడాది మరో మూవీని ప్రకటించారు . ప్రస్తుతం ఈ మూవీతోనే మెగా హీరో బిజీగా ఉన్నారు . ఈ చిత్రాం సాయి ధరమ్ తేజ్ ‌ కెరీర్ ‌ లో 18 వ సినిమాగా నిలవనుంది . ఈ చిత్రం ద్వారా రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇక సినిమా సంగతి పక్కనపెడితే సాయి ధరమ్ ‌ తేజ్ ‌( సాయి దుర్గ తేజ్) తాజాగా ఓ ఈవెంట్ ‌ కు హాజరయ్యారు . మయసభ పేరుతో వస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ ‌ ట్రైలర్ లాంఛ్ ‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు . తనతో ఒక సినిమా చేయాలని మయసభ డైరెక్టర్ ‌ దేవా కట్టను రిక్వెస్ట్ ‌ చేశానని మెగా హీరో అన్నారు . తన బ్యాడ్ ‌ టైమ్ ‌ లో నాతో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ‍ అది దేవాకట్టా మాత్రమేనని సాయి ధరమ్ తేజ్ తెలిపారు .

మయసభ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ .. ‘ దాదాపు 10 ఏళ్ల క్రితమే నా జర్నీ దేవాకట్టాతో స్టార్ట్ అయింది . మేమిద్దరం జిమ్ ‌ లో కలిసేవాళ్లం . సార్ నాతో ఒక సినిమా చేయండని రిక్వెస్ట్ ‌ చేసేవాడిని . అలా చేస్తే చివరికీ రిపబ్లిక్ ‌ మూవీతో జతకట్టాం . నా బ్యాడ్ ‌ టైమ్ ‌ లో నాకు వెలుగునిచ్చిన వ్యక్తి దేవాగారు . రిపబ్లిక్ ‌ సినిమా టైమ్ ‌ లో నేను ఏదైతే క్లైమాక్స్ కోరుకున్నానో అదే ముందుకు తీసుకెళ్లారు దేవా కట్టా ‘ అని తెలిపారు .

దేవా కట్టతో సాయి ధరమ్ తేజ్ అనుబంధం

కాగా .. దేవా కట్ట డైరెక్షన్ ‌ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మయసభ. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కృష్ణమ నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించారు. ఈ వెబ్ సిరీస్ ‌ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ ‌ లో స్ట్రీమింగ్ కానుంది .

సాయి ధరమ్ తేజ్ తన కష్టకాలంలో దేవా కట్ట తనకు ఎంతగా సహాయపడ్డారో వివరించారు. రిపబ్లిక్ సినిమాతో వారి సహకారం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.