|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మ్యాడ్ 3: షాకింగ్ ట్విస్ట్! అంతా కొత్తవాళ్లే, దెయ్యంతో కామెడీ ట్రీట్?

Published: 02-02-2026, 1:05 AM
మ్యాడ్ 3: షాకింగ్ ట్విస్ట్! అంతా కొత్తవాళ్లే, దెయ్యంతో కామెడీ ట్రీట్?
  • మ్యాడ్ సిరీస్‌లో గతంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించారు.
  • మ్యాడ్ 3 మూవీలో కొత్త నటీనటులు నటించే అవకాశం ఉంది.
  • ఈ సినిమాను కల్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయనున్నారు, సూర్యదేవర హారిక, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
  • బాయ్స్ హాస్టల్‌లో లేడీ దెయ్యం వస్తే ఏం జరుగుతుందనే కథాంశంతో సినిమా ఉండవచ్చు.

టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, మ్యాడ్ సిరీస్ నుండి మ్యాడ్ 3 రాబోతుంది. ఈ చిత్రంలో కొత్త నటీనటులు నటించనున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోండి.

మ్యాడ్ 3 లో కొత్త నటీనటులు

Mad 3 : టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.. స్టార్ హీరోల సినిమాలు కన్నా చిన్న సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా మార్కులు వేస్తున్నారు. చిన్న స్టోరీ లైన్ తో వచ్చిన ప్రతి సినిమా కూడా ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్నీ సొంతం చేసుకుంటున్నాయి.. కామెడీతో కడుపుబ్బ నవ్వించిన సినిమాలలో మ్యాడ్ మూవీ ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా కేవలం ఒక చిన్న స్టోరీ తో కామెడీ బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది.. ఇది బాగా హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా గత ఏడాది మ్యాడ్ స్క్వేర్ చిత్రం వచ్చింది. ఈ మూవీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్గా మరో సినిమా రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈసారి రాబోతున్న మూవీలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

గతంలో వచ్చిన మ్యాడ్ సిరీస్ మూవీలలో నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ మెప్పించారు. కాగా, ఈ ఏడాది మ్యాడ్ 3 మూవీ రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొత్త వారు ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్‌ కూడా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ను కల్యాణ్ శంకర్‌ డైరెక్ట్ చెయ్యగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌లలో ఎవరో ఒక్కరు మాత్రమే పార్ట్‌-3లో ఉంటారట.. ఇదే యాక్టర్స్ తో మళ్ళీ తీస్తే కాస్త బోరింగ్ గా ఉంటుందని కొత్త వాళ్ళని దించే ప్రయత్నంలో క్షేత్ర యూనిట్ ఉన్నట్లు ఓ వార్త నెట్టిందా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే మ్యాడ్‌ క్యూబ్‌ ప్రాజెక్ట్‌లోకి లిటిల్ హార్ట్స్ ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ఎంట్రీ ఇచ్చారని సమాచారం.

సినిమా నిర్మాణం మరియు దర్శకత్వం

హారర్ కామెడీ జోనర్‌లో చిత్రం

ఇటీవల వచ్చిన హారర్ కామెడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఈ చిత్రయినట్టు కూడా అలాంటి జోనర్లో సినిమాని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. బాయ్స్ హాస్టల్ కి ఒక లేడీ దయ్యం వస్తే ఆ బాయ్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న స్టోరీ లైన్ తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.. దెయ్యంతో ఆ తర్వాత హీరోలు బాధలు ఎలా ఉంటాయి అన్నది సినిమాలో చూడాల్సిందే.. ప్రాజెక్ట్‌ షూటింగ్ మొదలుకాకముందే ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మ్యాడ్ 3 హారర్ కామెడీగా రూపొందనున్నట్లు క్లారిటీ రావడంతో ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. త్వరలోనే ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి రానున్నట్లు సమాచారం..

మ్యాడ్ 3 చిత్రం కొత్త నటీనటులతో, హారర్ కామెడీ జోనర్‌లో వస్తుందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.