|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రైతులకు చంద్రబాబు భారీ వరాలు! మదనపల్లెలో వ్యవసాయ విద్యాసంస్థ, విత్తన సరఫరాలో విప్లవం!

Published: 07-05-2026, 12:02 AM
రైతులకు చంద్రబాబు భారీ వరాలు! మదనపల్లెలో వ్యవసాయ విద్యాసంస్థ, విత్తన సరఫరాలో విప్లవం!
  • మే 15 నాటికి రైతులకు విత్తన సరఫరాకు రూ.200 కోట్లు కేటాయింపు.
  • పంటలకు గిట్టుబాటు ధరలు, నాణ్యమైన దిగుబడులపై సీఎం చంద్రబాబు దృష్టి.
  • మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు సీఎం ప్రకటన.
  • మొక్కజొన్న, అరటి, ఆయిల్ పామ్ వంటి పంటల కొనుగోళ్లు, ఇథనాల్ ఉత్పత్తిపై సమీక్ష.

చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంపై కీలక సమీక్ష నిర్వహించారు. రైతులకు మే 15 నాటికి విత్తన సరఫరా చేయాలని, రూ.200 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, ప్రకృతి సేద్యంపై దృష్టి సారించారు.

విత్తన సరఫరా, నిధుల కేటాయింపుపై సీఎం ఆదేశాలు

ఈ ఏడాది మే 15 నుంచే రైతులకు సాగునీరు అందించనున్న దృష్ట్యా రాష్ట్రంలో వేగంగా విత్తన సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. విత్తనాల సరఫరా కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ తదితర పంటల కొనుగోళ్లపై సీఎం వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా పంటలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతు కు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. మరిన్ని పంటలను ప్రకృతి సేద్యం విధానంలో వివిధ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు.

సేంద్రీయ సాగుకు కంపోస్టు ఎరువును సరఫరా చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి వస్తుందని అధికారులు వివరించారు. మొక్క జొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలని అన్నారు.

రైతులకు గిట్టుబాటు ధరలు, ప్రకృతి సేద్యం ప్రోత్సాహం

అరటి, ఆయిల్ పామ్, మిర్చి, కోకో లాంటి పంటలకు సంబంధించి ధరల సమస్య లేదని రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సీజన్ కంటే ముందే రాష్ట్రంలోని నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను సరఫరా చేయాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే పంట సీజన్ కు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. నాఫెడ్ నుంచి మినుములు ఇతర వాణిజ్య పంటల్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. పీఎండీఎస్ పథకం ద్వారా తక్కువ యూరియా వినియోగానికి ఇచ్చే ప్రోత్సాహకం పై కేంద్రంతో మాట్లాడాలని సీఎం వారికి సూచించారు. మదనపల్లె లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు కానుందని సీఎం అన్నారు.

రాష్ట్రంలో ఎస్‌హెచ్‌జీ మహిళల సీవీడ్ ఫార్మింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. రాష్ట్రంలోని సముద్ర నాచు ఉత్పత్తులు, విలువ జోడింపు తదితర అంశాల్లో మహిళలు ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలుగా ఓ ఎకనామిక్ మోడల్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీవీడ్ కల్టివేషన్ ద్వారా ఎస్ హెచ్ జీ మహిళల ఆదాయ మార్గాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచనలు చేశారు.

ఏపీలోని సముద్ర తీరప్రాంతాల్లో సీవీడ్ కల్టివేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సెంట్రల్ సాల్ట్ మెరైన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తదితర సంస్థల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వర్చువల్ గా మాట్లాడారు.

మదనపల్లెలో వ్యవసాయ విద్యాసంస్థ ఏర్పాటు

అమృతా విశ్వ విద్యాపీఠంతో కలిసి మహిళలకు సీవీడ్ కల్చర్ సాగుకు సంబంధించిన అంశాలపై ఓ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. సీవీడ్ ద్వారా వచ్చే ఆదాయంపై ఓ ఎకనామిక్ మోడల్ ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుదీర్ఘమైన తీరప్రాంతంలో సముద్ర నాచు సాగు ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేలా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి వచ్చేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీవీడ్ ద్వారా వివిధ ఉత్పత్తులు తయారు చేసేందుకు విలువ జోడించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

మొత్తంగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ సమీక్ష స్పష్టం చేసింది. విత్తన సరఫరా, గిట్టుబాటు ధరలు, నూతన విద్యాసంస్థ ఏర్పాటు ద్వారా రైతులకు అండగా నిలవాలని సంకల్పించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.