
📌 Key Points
- మధ్యప్రదేశ్‍లోని శివపురి బస్టాండ్‍లో 7 అడుగుల మొసలి కలకలం.
- బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
- రెండు గంటల పాటు శ్రమించి మొసలిని పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది.
- కురిసిన వర్షాల కారణంగా జనావాసాల్లోకి మొసళ్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్‍లోని శివపురి బస్టాండ్‍లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండి ఉన్న బస్టాండ్‍లోకి ఒక్కసారిగా 7 అడుగుల మొసలి రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బస్టాండ్‌లో మొసలి కలకలం
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్‍లోకి 7 అడుగుల భారీ మొసలి (Crocodile in Bus Stand) ఎంట్రీ ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. అంతా బస్సుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన మొసలి అందరినీ హాడలెత్తించింది. మధ్యప్రదేశ్‍లోని (Madhya Pradesh) శివపురి (Shivpuri) జిల్లాలో ఈ ఘటన జరగగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బస్టాండ్‍ను ఆనుకుని ఉన్న మురుగు కాలువ సమీపం నుంచి మెళ్లిగా బస్టాండ్ వైపు వచ్చింది. భారీ ఆకారంలో ఉన్న ఆ మొసలిని చూసి ప్రయాణికులు భయందోళన చెందారు. వెంటనే అధికారులకు విషయం చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ బృందం ఆ మొసలిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు రెండు గంటల రెస్క్యూ తరువాత ఆ మొసలిని బంధించారు. అనంతరం అక్కడి నుంచి తరలించి ఓ భారీ చెరువులో వదిలి పెట్టారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా శివపురి నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో జనావాసాల్లోకి మొసళ్లు సంచరిస్తున్నాయి. గత రెండు రోజుల్లో రోడ్లు, జనావాసాల సమీపంలో ప్రమాదకరమైన మొసళ్లు కనిపించడం ఇది రెండోసారి. ఇటీవల రాత్రి శివపురిలోని ప్రసిద్ధ చింతాహరణ హనుమాన్ ఆలయం సమీపంలోని ఒక ఇంట్లోకి మొసలి ప్రవేశించింది.
రెండు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్
జనావాసాల్లోకి మొసళ్లు ఎందుకు వస్తున్నాయి?
మొత్తానికి అటవీ శాఖ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మొసలిని పట్టుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


