
📌 Key Points
- కట్టమైసమ్మ గుడిలో దారుణం: నిందితుడిని పట్టుకున్న పోలీసులు, కర్ణాటక వాసిగా గుర్తింపు!
- మాధవి లత ఎమోషనల్ కామెంట్స్: మతి స్థిమితం గుడిలోనే తప్పుతుందా? వేరే మతస్తులకే ఎందుకు ఇలా?
- నిందితుడిపై కఠిన చర్యలు: 333, 196(2), 298, 299 సెక్షన్ల కింద కేసు నమోదు, 14 రోజుల రిమాండ్!
- గుడిలో టాయిలెట్ ఎందుకు?: మత పిచ్చి ఎవరికి? ప్రతి నిత్యం దేవాలయాల్లోనే ఎందుకు జరుగుతుంది? మాధవి లత ఫైర్!
కట్టమైసమ్మ గుడి దగ్గర జరిగిన సంఘటన టాలీవుడ్‌లో దుమారం రేపుతోంది. మాధవి లత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చదవండి!
కట్టమైసమ్మ గుడిలో ఏం జరిగిందంటే…
కట్టమైసమ్మ గుడి సంఘటనపై మాధవి లత సంచలన పోస్ట్ పెట్టారు. హిందూ దేవుళ్లను కాపాడాలని కోరారు మాధవి లత. సఫిల్‌గూడ కట్టమైసమ్మ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సంఘటనకు కారణమైన నిందితుడిని గుర్తించారు పోలీసులు. నిందితుడు కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన అల్తాఫ్‌గా గుర్తించారు. నేరెడ్‌మెట్ ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడట. దీంతో అల్తాఫ్‌పై 333, 196(2), 298, 299 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే అల్తాఫ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
పోలీసుల విచారణ: నిందితుడు ఎవరు?
కట్టమైసమ్మ గుడి సంఘటనపై మాధవి లత స్పందించారు. ఈ వీడియో చూడగానే కడుపులో తిప్పిందని ఎమోషనల్ అయ్యారు. మతి స్థిమితం కేవలం గుడిలో ఎందుకు అవుతుంది? అని ప్రశ్నించారు. అది కూడా వేరే మతస్తులకు మాత్రమే గుడి ఎందుకు బాత్రూంలా కనిపిస్తుందని ఆగ్రహించారు. ఆ రెండు మతాలు మాత్రమే ఎందుకు గుడిలో టాయిలెట్ చేస్తారని ప్రశ్నించారు. మత పిచ్చి ఎవరిది?? అని నిలదీశారు. ఏంటిది అని అడిగితే మత పిచ్చి మాకు ఉన్నట్లా? ప్రతి నిత్యం దేశంలో ఇలాంటివి సహజం కేవలం దేవాలయాల్లో మాత్రమే ఎందుకు? అని ఫైర్ అయ్యారు. లోపం ఎక్కడ ఉంది ? ఆలోచన చేయండి అని కోరారు.
మాధవి లత ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi)
కట్టమైసమ్మ గుడి సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాధవి లత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.


