
📌 Key Points
- సాయిబాబా, అన్వేష్‌లపై వ్యాఖ్యలతో మాధవీలత వైరల్, పోలీస్ ఫిర్యాదు నమోదైంది.
- తన వ్యాఖ్యలు సరైనవేనని, ఎలాంటి భయం లేదని మాధవీలత స్పష్టం చేశారు.
- 2018లో రాజకీయాల్లోకి వచ్చి 2019లో పోటీ పడ్డారు; భవిష్యత్ ప్రణాళికలు తెలియవని చెప్పారు.
- పరిశ్రమలో రాత్రి జాగ్రత్త అనిపించినా, ఉదయానికల్లా మర్చిపోతానని ఓపెన్‌గా చెప్పారు.
టాలీవుడ్ నటి మాధవీలత ఇటీవల సాయిబాబా, అన్వేష్‌పై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈ వివాదాల నేపథ్యంలో, ఆమె తన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, సినీ పరిశ్రమలోని జాగ్రత్తలపై చేసిన సంచలన నిజాలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.
మాధవీలత తాజా వివాదాలు: సాయిబాబా, అన్వేష్‌పై వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి మాధవీలత ఈ మధ్య ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నారు. ఇటీవల నా అన్వేషణ, శివాజీ అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన ఆమె.. హిందూ దేవుళ్లపైనా కామెంట్స్ చేశారు. 2008లో నచ్చావులే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. ప్రస్తుతం సామాజిక సేవలో ఉన్నారని చెప్పొచ్చు.
తాను ఇటీవల సాయిబాబాపై చేసిన ఓ వీడియో వైరల్ కావడం, అది పోలీస్ ఫిర్యాదుకు దారి తీయడం జరిగిందని నటి మాధవీలత తెలిపింది. తాను మాట్లాడింది సరైందేనని, కాబట్టి భయం లేదని ఆమె తెలిపింది. ఇటీవల ఆమె సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
రాజకీయ ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికలపై మాధవీలత
ఇన్‌ఫ్ల్యూయన్సర్ అన్వేష్ హిందూ మతం, హిందూ ధర్మం, సీతమ్మ గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగింది. దీనిపై కేసు కూడా నమోదైంది. గత నెలలో తాను కూడా అన్వేష్‌పై ఒక వీడియో చేశానని మాధవీలత తెలిపింది. అటు హీరో శివాజీ వ్యాఖ్యలపై కూడా స్పందించిందామె. ఈ సంఘటనపై తాను ఒక రోజు ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నానని, వెంటనే జనాలు స్పందించి ఇలా ప్రశ్నిచారని పేర్కొంది.
తాను 2018లో రాజకీయాలలో చేరానని.. 2019లో పోటీ చేశానని.. 2020-21లో చాలా చురుకుగా పాల్గొన్నానని మాధవీలత తెలిపింది. తన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో ఇంకా తనకే తెలియదని.. తాను చాణక్యుడిలా పథకాలు వేయలేనని చెప్పింది మాధవీలత. అటు సినిమాల్లో అలా చేస్తేనే ఆఫర్లు వస్తాయని మాధవీలత తెలిపింది.
పెళ్లి, పరిశ్రమ జాగ్రత్తలపై నటి మాధవీలత సంచలన నిజాలు
పెళ్లి ఎప్పుడూ అనే ప్రశ్నకు మాధవీలత ఇలా సమాధానమిచ్చారు.. ఎప్పుడు జరుగుతుందో తనకే తెలియదన్నారు. తాను చాలా జెన్యూన్‌గా ఉండాలని, మహిళలకు చాలా గౌరవం ఇవ్వాలని ఆశిస్తానని తెలిపింది. అలాగే పరిశ్రమలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జాగ్రత్త పడాలి అని అనిపించిందా అనే ప్రశ్నకు.. రాత్రి నిద్రపోయే ముందు అనిపిస్తుందని, తెల్లారేక మర్చిపోతానని సరదాగా సమాధానమిచ్చింది.
మాధవీలత వివాదాలపై, వ్యక్తిగత జీవితంపై చేసిన ఓపెన్ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. నిర్భయంగా నిజాలు చెప్పే ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తి నెలకొంది.


