
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVSU) నుంచి వస్తున్న ‘మహాకాళి’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన అసురగురు శుక్రాచార్య ఫస్ట్ లుక్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఆ పాత్రలో నటిస్తున్నారు. ‘హనుమాన్’ విజయం తర్వాత ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
Key Points
మహాకాళి సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVSU) లో భాగం.
పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఫిమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తోంది.
అసురగురు శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్.
'హనుమాన్' సక్సెస్ తర్వాత PVSUలో 'జై హనుమాన్', 'అధీరా' సినిమాలు రానున్నాయి.
మహాకాళి: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో
Mahakali: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మరో సినిమా మహాకాళి(Mahakali). ఫీమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది. హనుమాన్ సినిమా సక్సెస్ తరువాత వస్తున్న సినిమా కావడంతో మహాకాళి సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
OG Special show: ఓజీ స్పెషల్ షోలో మెగా ఫ్యామిలీ.. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి.. ఈ ఫోటోలు చూశారా?
అసురగురు శుక్రాచార్య ఫస్ట్ లుక్ వచ్చేసింది
తాజాగా దసరా పండుగ సందర్బంగా ఈ సినిమా నుంచి అసురగురు శుక్రాచార్య ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడు. “దేవతల నీడలో శక్తివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు” అనే క్యాప్షన్ ను పోస్టర్ తోపాటు యాడ్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
PVSUలో తదుపరి సినిమాలు: జై హనుమాన్, అధీరా
ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అధీర అనే సినిమాను కూడా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు కూడా ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మహాకాళి సినిమా అంచనాలను పెంచింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘జై హనుమాన్’, ‘అధీరా’ వంటి సినిమాలు కూడా రానున్నాయి. ఈ చిత్రాలన్నీ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి.


