|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

AI మాయాజాలం: పరీక్షల్లో చాట్‌జీపీటీ మోసం! 81 మంది ఉద్యోగులపై వేటు!!

Published: 09-03-2026, 4:05 AM
AI మాయాజాలం: పరీక్షల్లో చాట్‌జీపీటీ మోసం! 81 మంది ఉద్యోగులపై వేటు!!
  • మహారాష్ట్రలో పరీక్షల్లో చాట్‌జీపీటీ వినియోగం కలకలం
  • 10, 12 తరగతుల పరీక్షల్లో కాపీయింగ్ బయటపడింది
  • 81 మంది టీచర్లు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
  • చౌస్లా పరీక్షా కేంద్రంలో భారీగా మాస్ కాపీయింగ్

మహారాష్ట్రలో టెక్నాలజీ దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. 10, 12వ తరగతి పరీక్షల్లో చాట్‌జీపీటీ ద్వారా కాపీయింగ్ చేయిస్తున్న 81 మంది ఉపాధ్యాయులు, సిబ్బందిపై వేటు వేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

చాట్‌జీపీటీతో పరీక్షల్లో అక్రమాలు

టెక్నాలజీని అడ్డంపెట్టుకోని కొందరు అక్రమాలకు వాడుకుంటున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ని ఉపయోగించి విద్యార్థులకు కాపీయింగ్‌లో సహకరించిన 81 మంది ఉపాధ్యాయులు, పరీక్షా సిబ్బందిపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. వీరిని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర రాష్ట్ర సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యా బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.

గుట్టురట్టు చేసిన విద్యాశాఖ

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అవకతవకలు జరిగినట్లు వార్తలు వచ్చినప్పటికీ, బీడ్ జిల్లాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా అక్కడి చౌస్లా పరీక్షా కేంద్రంలో భారీ ఎత్తున మాస్ కాపీయింగ్ జరిగినట్లు తేలింది. విద్యార్థులకు సమాధానాలు అందించడానికి పరీక్షా సిబ్బందే స్వయంగా చాట్‌జీపీటీని వాడినట్లు విద్యా శాఖ గుర్తించింది.

సస్పెన్షన్ వేటు, విచారణకు ఆదేశం

ప్రస్తుతం మహారాష్ట్రలో బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. 12వ తరగతి (HSC) పరీక్షలు.. ఫిబ్రవరి 10, 2026న ప్రారంభమై, మార్చి 11 వరకు కొనసాగనున్నాయి. 10వ తరగతి (SSC) పరీక్షలు.. ఫిబ్రవరి 20, 2026న మొదలై, మార్చి 18 వరకు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో జరిగిన ఈ ఉల్లంఘనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ‘ఇది సాంకేతికతను దుర్వినియోగం చేయడమే కాకుండా, పరీక్షల సమగ్రతను దెబ్బతీయడమే. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోం’ అని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.

చాట్‌జీపీటీ వినియోగంతో పరీక్షల్లో అవకతవకలు జరగడం విచారకరం. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.