|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్ రికార్డులన్నీ బ్రేక్.. ఇండియాలో ఈ ఘనత సాధించిన తొలి మూవీ.. మౌత్ పబ్లిసిటీకి ఉండే పవర్ చూపిస్తోంది

Published: 04-08-2025, 4:58 AM
బాక్సాఫీస్ రికార్డులన్నీ బ్రేక్.. ఇండియాలో ఈ ఘనత సాధించిన తొలి మూవీ.. మౌత్ పబ్లిసిటీకి ఉండే పవర్ చూపిస్తోంది

కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల తర్వాత హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ సినిమా ఇండియాలో బాక్సాఫీస్ రికార్డులు బద్దల చేసింది. ఈ సినిమాకు ముందు ఎలాంటి ప్రచారం లేదు.

Key Points

1

మహావతార్ నరసింహా యానిమేటెడ్ సినిమా ఇండియాలో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

2

ఇండియాలో ఇంత వసూళ్లు సాధించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది.

4

హిందీలో అత్యధిక వసూళ్లు సాధించి, మేకర్లను ఆశ్చర్యపరిచింది.

అనూహ్య విజయం సాధించిన మహావతార్ నరసింహ

మహావతార్ నరసింహ.. ఇదో యానిమేటెడ్ మూవీ. కేజీఎఫ్, సలార్ లాంటి మూవీస్ తీసిన హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన సినిమా అని తప్ప ఇది రిలీజయ్యే ముందు పెద్దగా ఎలాంటి బజ్ లేదు. కానీ ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ ఇండియాలోనే రూ.100 కోట్లకుపై గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకూ ఇండియాలో ఏ ఇతర యానిమేటెడ్ మూవీకి సాధ్యం కాని ఘనత ఇది.

ఓ యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని ఎవరైనా ఊహించారా? అది కూడా ఇండియాలో ఇలాంటి సినిమాలకు పెద్దగా ఆదరణ లభించదు. కానీ మహావతార్ నరసింహ అన్ని అంచనాలనూ తలకిందులు చేసింది. sacnilk.com ప్రకారం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలోనే ఈ సినిమా వసూళ్లు రూ.108 కోట్లు కావడం విశేషం.

మన దేశంలో ఇప్పటి వరకూ ఏ ఇతర యానిమేటెడ్ మూవీకి సాధ్యం కాని రికార్డు ఇది. ఎన్నో హాలీవుడ్ యానిమేటెడ్ సినిమాలు వచ్చినా.. అవేవీ ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేదు. గతంలో స్పైడర్ మ్యాన్, ఇంక్రెడిబుల్స్ 2, ఫ్రోజెన్ 2 లాంటివి రూ.50 కోట్లకుపైగా వసూలు చేశాయి. కానీ వాటి రికార్డులను ఎప్పుడూ తుడిచి పెట్టేసిన ఈ మహావతార్ నరసింహ తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు.

మౌత్ పబ్లిసిటీ సత్తా చూపిస్తున్న యానిమేటెడ్ సినిమా

మహావతార్ నరసింహ మూవీని కేజీఎఫ్, సలార్ మేకర్స్ అయిన హోంబలే ఫిల్మ్స్ తెరెక్కించడం అనే పాయింట్ తప్ప ఈ మూవీకి అంతకుముందు పెద్దగా బజ్ లేదు. కానీ ఒక్కసారి థియేటర్లలో రిలీజైన తర్వాత ప్రేక్షకులే ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు సినిమాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

కేవలం మౌత్ పబ్లిసిటీతోనే ఈ మూవీ రికార్డు బాక్సాఫీస్ వసూళ్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తొలిరోజు తెలుగులో కేవలం రూ.30 లక్షలు వసూలు చేసిన ఈ మూవీ.. 10వ రోజు ఏకంగా రూ.4.5 కోట్లు కొల్లగొట్టడం విశేషం. మొత్తంగా పది రోజుల్లో కేవలం తెలుగులోనే రూ.20 కోట్లకుపైగా వసూలు చేసింది.

భారతీయ యానిమేషన్ చరిత్రలో కొత్త అధ్యాయం

ఇక హిందీలోనే ఈ మూవీ అతిపెద్ద సక్సెస్ అందుకుంది. పది రోజుల్లో రూ.67.25 కోట్లు రాబట్టింది. తొలి రోజు రూ.1.35 కోట్ల వసూళ్లు కాస్తా.. పదో రోజు రూ.17.8 కోట్లకు చేరాయి. హిందీ ప్రేక్షకులు ఈ యానిమేటెడ్ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడి వసూళ్లు మూవీ మేకర్స్ ను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. నిజానికి హోంబలే ఫిల్మ్స్ సొంత భాష కన్నడలో మాత్రం ఈ సినిమాకు 10 రోజుల్లో కేవలం రూ.2.33 కోట్లు మాత్రమే వచ్చాయి.

తమిళంలో రూ.కోటికిపైగా మాత్రమే ఉండగా.. మలయాళంలో అసలు ఎవరూ పట్టించుకోలేదు. కేవలం హిందీ, తెలుగు భాషల్లోనే మహావతార్ నరసింహ రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. సెకండ్ వీకెండ్ ఈ మూవీ సాధించిన వసూళ్లతో రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. రానున్న రోజుల్లో రూ.150 కోట్ల మార్క్ పై కూడా కన్నేసింది.

మహావతార్ నరసింహ యానిమేటెడ్ సినిమా అనూహ్య విజయం సాధించి, మౌత్ పబ్లిసిటీ శక్తిని చాటుకుంది. ఇండియన్ యానిమేషన్ చిత్ర పరిశ్రమకు ఇది కొత్త మార్గదర్శకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.