|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mahavatar Narsimha: ఓటీటీకి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌.. అఫీషియల్ ప్రకటన

Published: 18-09-2025, 10:43 AM
Mahavatar Narsimha: ఓటీటీకి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌.. అఫీషియల్ ప్రకటన

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది. రెండు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.

Key Points

1

మహావతార్ నరసింహ 7 కోట్ల రూపాయలతో రికార్డు సృష్టించింది.

2

50 రోజుల్లో 200 థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది.

4

సెప్టెంబర్ 19న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం.

బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం

ఎలాంటి అంచనాలు లేకుండా యానిమేషన్ చిత్రం మహావతార్ ‌ నరసంహా . జూలై 25 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది . రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మ‌హా విష్ణువు ద‌శావ‌తారాల ఆధారంగా ‘మ‌హావ‌తార్’ సినిమాటిక్ యూనివ‌ర్స్ (ఎమ్‌.సి.యు) పేరుతో తొలి చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు .

ఓటీటీ విడుదల తేదీ ప్రకటన

అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్‌ దేశాయ్, చైతన్య దేశాయ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం 200 థియేటర్స్‌కు పైగా 50 రోజులు పూర్తి చేసుకుందని ఇటీవలే మేకర్స్‌ ప్రకటించారు. రిలీజైన రోజు నుంచి ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టినట్లు వెల్లడించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే .

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

బాక్సాఫీస్ వద్ద బ్లాక్ ‌ బస్టర్ ‌ గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . తాజాగా ఈ సూపర్ హిట్ ‌ మూవీ ఓటీటీ డేట్ ‌ మేకర్స్ రివీల్ చేశారు . ఈ శుక్రవారం ( సెప్టెంబర్ 19 న ) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు . ఈ మేరకు నెట్ ‌ ఫ్లిక్స్ ‌ మహావతార్ నరసింహ పోస్టర్ ‌ ను పంచుకుంది . ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి .

మహావతార్ నరసింహ చిత్రం ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. బాక్సాఫీస్ విజయం తర్వాత, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఈ అద్భుత చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం లభించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.