|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహావతార్ నరసింహ: విజువల్స్ వండర్‌గా ఆకట్టుకుంటోన్న ‘మహావతార్ నరసింహ’ ట్రైలర్

Published: 09-07-2025, 12:36 PM
మహావతార్ నరసింహ: విజువల్స్ వండర్‌గా ఆకట్టుకుంటోన్న ‘మహావతార్ నరసింహ’ ట్రైలర్

హోంబలే ఫిలిమ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను అలరించింది.

Key Points

1

మహావతార్ నరసింహ ట్రైలర్ విజువల్ వండర్‌గా ఆకట్టుకుంటోంది.

2

హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, నరసింహుడి కథ అద్భుతంగా తెరకెక్కింది.

4

మహావతార్ ప్రాంచైజీలో భాగంగా మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.

అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్

హోంబలే ఫిలిమ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తు్న్న లేటెస్ట్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘మహావతార్ నరసింహ’. ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ విజువల్ వండర్ నుంచి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్యకశిపుడి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది.

ఎపిక్ విజువల్స్, అద్భుతమైన నేపథ్య సంగీతంతో విజువల్ వండర్‌లా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మహావతార్ ప్రాంచైజీలో.. మహావతార్ నరసింహ (2025), మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) రాబోతున్నాయి. మహావతార్ నరసంహ 3Dలో ఐదు భారతీయ భాషలలో 2025 జులై 25న విడుదలవుతోంది.

నరసింహ అవతారం

మహావతార్ ప్రాంచైజీ

మహావతార్ నరసింహ ట్రైలర్ అంచనాలను అందుకుని, 2025 జులై 25న విడుదల కానున్న ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. మహావతార్ ప్రాంచైజీ భవిష్యత్తు సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.