
రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` ట్రైలర్ విడుదలైంది. ఇందులో మహేష్ బాబు రాముడిగా కనిపించగా, రామాయణంలోని లంకాదహనం ఘట్టాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. టైమ్ ట్రావెల్‌తో కూడిన ఈ విజువల్ వండర్ సినిమాపై భారీ అంచనాలను సృష్టించింది.
Key Points
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'వారణాసి' ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్‌లో మహేష్ బాబు రాముడిగా, రామాయణంలోని లంకాదహనం ఘట్టం చూపించారు.
టైమ్ ట్రావెల్ కథాంశంతో కూడిన ఈ చిత్రం 512సీఈ నుండి 7200 ఈబీసీ వరకు సాగుతుంది.
అద్భుతమైన విజువల్స్, ఊహకందని కథనంతో 'వారణాసి' అంచనాలను పెంచింది.
ట్రైలర్ విడుదల: సాంకేతిక సమస్యలు, అద్భుత దృశ్యాలు
మహేష్ బాబు హీరోగా రాజమౌళి `వారణాసి` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ని ఈ శనివారం సాయంత్రం ఈవెంట్‌లో విడుదల చేశారు. అయితే ఇందులో ట్రైలర్‌ని విడుదల చేయాలని భావించారు. సినిమా కథేంటో చెప్పే వీడియోని భారీగా ప్లాన్ చేశారు. దాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌లో దీన్ని రూపొందించారు. ఈవెంట్‌లో అభిమానులకు ఈ వీడియోని ప్రదర్శించాలని భావించారు. కానీ టెక్నీకల్‌గా సమస్యలు వచ్చాయి. దానికి పవర్ సరిపోవడం లేదని, దీంతో చేయడం కష్టమని రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా ఎట్టకేలకు ట్రైలర్‌ని విడుదల చేశారు.
ఇందులో సినిమా కథేంటో చూపించారు. ఇది వారణాసి కథతో రూపొందించారు. అదే సమయంలో టైమ్ ట్రావెల్ కథతో రూపొందించినట్టు ట్రైలర్‌లో కనిపించింది. ఈ సినిమా వారణాసిలో 512సీఈ కాలం నుంచి ప్రారంభమైంది. అందులోని ఒక అగ్ని కణం ప్రయాణిస్తూ 2017 సీఈ ఆస్ట్రరాయిడ్ సంభవికి చేరుకుంటుంది. అది ఐస్ కణంగా మారి ఆంటార్కిటికా సముద్రంలో పడింది. అందులోనుంచి ఆఫ్రికన్ అడవులకు, అక్కడి నుంచి ఉగ్రబట్టి కేవ్‌లోకి, అక్కడి నుంచి 7200 ఈబీసీ కాలంలోని త్రేతాయుగంలోని లంకానగరానికి చేరుకుంది. అక్కడ హనుమంతుడి విశ్వరూపం చూపించారు. లంకా దహనం చూపించారు. అక్కడి నుంచి వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌కి చేరుకుంది.
మహేష్ బాబు రాముడిగా: రామాయణం, టైమ్ ట్రావెల్
అందులో నుంచి ఒక పవర్‌తో త్రిశూలం పట్టుకుని ఎద్దుపై సవారీ చేస్తూ మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఆయన లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఈ సందర్భంగా వారణాసి టైటిల్ రివీల్ అయ్యింది. మొత్తంగా ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. విజువల్స్ ఊహకందని విధంగా ఉంది. అద్భుతం అని చెబితే అతిశయోక్తి కాదు. ఏ హాలీవుడ్ చిత్రాలు కూడా దీనికింద పనికి రావని చెప్పొచ్చు. మొత్తంగా మూడు నాలుగు టైమ్ ట్రావెల్స్ లోకి వెళ్లి వచ్చే కథగా, హనుమంతుడి జర్నీగా ఆవిష్కరించినట్టుగా ఉంది. అదే సమయంలో రాజమౌళి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. రామాయణంలోని లంకా దహణం ప్రధానంగా చేసుకుని ఈ మూవీని రూపొందించినట్టు తెలిపారు.
వారణాసి కథా నేపథ్యం: అంచనాలు, ప్రత్యేకతలు
ఇందులో మహేష్ బాబు పాత్రని తెలియజేశారు రాజమౌళి. రాముడిగా కనిపిస్తారని తెలిపారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాన్ని ఇందులో ఆవిష్కరించబోతున్నారని అర్థమవుతుంది. ఎప్పుడూ చూడని మూవీని మనకు చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఈ అన్ని కాలాలకు మహేష్ జర్నీ చేస్తారు. అదే ఈ మూవీ అని తెలుస్తోంది. సినిమాని ఒక ఎపిక్‌గా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ రామాయణం ఎపిసోడ్‌ని 60 రోజులు షూట్ చేశారట. అయిపోయిందని, మహేష్‌కి రాముడి గెటప్ వేస్తే అదిరిపోయిందన్నారు. ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఆ ఎపిసోడ్ సాగిందన్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లోనూ ఆ షాట్ చూపించి వదిలేశారు. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.
మొత్తంగా, `వారణాసి` ట్రైలర్ ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. మహేష్ బాబు లుక్, రాజమౌళి అద్భుత సృష్టి సినిమాపై భారీ హైప్ సృష్టించాయి. ఈ ఎపిక్ మూవీ విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


