|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మహేష్ బాబుకి తప్పిన భారీ ప్రమాదం! ఆ దర్శకుడితో సినిమా చేసి ఉంటే అంతేనా?

Published: 31-03-2026, 4:35 AM
షాకింగ్: మహేష్ బాబుకి తప్పిన భారీ ప్రమాదం! ఆ దర్శకుడితో సినిమా చేసి ఉంటే అంతేనా?
  • మహేష్ బాబు, మెహర్ రమేష్ మంచి స్నేహితులు.. కానీ సినిమా మాత్రం చేయలేదు!
  • ప్రభాస్‌తో ‘బిల్లా’, ఎన్టీఆర్‌తో ‘శక్తి’, ‘కంత్రి’ సినిమాలు చేసిన మెహర్ రమేష్.
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ నెక్స్ట్ ఇయర్ రిలీజ్!
  • ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ మారిపోనుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఒక సంచలన వార్త! ఆయన ఒక ఫ్లాప్ డైరెక్టర్ నుండి ఎలా తప్పించుకున్నాడు? ఒకవేళ సినిమా చేసి ఉంటే పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలంటే చదవండి!

మహేష్ బాబు – మెహర్ రమేష్: సినిమా ఎందుకు చేయలేదు?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తుంటాడు. ఒక్కో సారి ఆ సినిమా కూడా కష్టమే. ఆయన తండ్రి కృష్ణ ఏడాదికి 15 కి పైగా సినిమాలు చేసిన రికార్డు ఉండగా.. మహేష్ బాబు మాత్రం ఒక్క సినిమాతో.. అభిమానులకు కావల్సిన ఫుల్ మీల్స్ పెట్టేస్తున్నాడు. సాలిడ్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతుంటాడు.

సినిమాలు చేసే క్రమంలో మహేష్ బాబు చాలా సవాళ్లు ఫేస్ చేస్తుంటాడు. కెరీర్ బిగినింగ్ లో ఎలా ఉన్నా… స్టార్ గా ఎదిగిన క్రమంలో.. మహేష్ బాబు సినిమాలు, కథలు , డైరెక్టర్ల విషయం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఎన్నో వందల కథలు విన్నా.. వర్కౌట్ అవుతుందనుకున్న కథతో, మంచి దర్శకుడిని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

మెహర్ రమేష్ కెరీర్: హిట్స్, ఫ్లాప్స్!

మహేష్ బాబు కథల సెలక్షన్ లో.. ఆయన భార్య నమ్రత ముఖ్యమైన పాత్ర వహిస్తుందని సమాచారం. ఆమె సెలక్షన్ వల్లే.. మహేష్ బాబుకు చాలా సక్సెస్ లు వచ్చాయన్నది టాక్. ఈక్రమంలో మహేష్ బాబు చాలామంది దర్శకులకు అవకాశం ఇచ్చాడు, కానీ తనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహర్ రమేష్ తో మాత్రం సినిమా చేయలేదు. దానికి కారణం ఏంటో తెలుసా?

మహేష్ బాబు కి మెహర్ రమేష్ కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక రకంగా మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ లను కూడా అతనే చూసుకుంటూ ఉంటాడట. మెహర్ రమేష్ కథలు నేరేట్ చేయడంలో మెస్మరైజ్ చేస్తాడన్న టాక్ ఉంది. ఈక్రమంలోనే మహేష్ బాబు కి కూడా రమేష్ చాలా కథలు చెప్పాడట. కానీ మహేష్ అవకాశం ఇవ్వలేదు.

రాజమౌళితో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ!

చాలామంది హీరోలతో రమేష్ మంచి మంచి సినిమాలు చేశాడు. ప్రభాస్ తో బిల్లా లాంటి అద్భుతాలు చేసిన రమేష్.. ఎన్టీఆర్ తో శక్తి, కంత్రి లాంటి డిజాస్టర్ సినిమాలు చేశాడు. ఇందులో కొన్ని సినిమాలు కథలు మహేష్ బాబుకు కూడా చెప్పాడట రమేష్. కానీ వాటిని మహేష్ బాబు ఒప్పుకోకపోవడంతో.. చాలా డిజాస్టర్స్ నుంచి సూపర్ స్టార్ బయటపడ్డాడని టాక్. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఇండస్ట్రీలో మాత్రం టాక్ గట్టిగానే ఉంది.

మెహర్ రమేష్ కెరీర్ లో చేసిన కొన్ని సినిమా సినిమాల్లో కూడా సక్సెస్ లు తక్కువే. దాదాపు పదేళ్ల గ్యాప్ తరువాత చిరంజీవి హీరోగా రమేష్ తెరకెక్కించి భోళా శంకర్ కూడా డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా వారణాసితో బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్ తో రూపొందుతున్న ఈసినిమాతో మహేష్ బాబు రేంజ్ మారిపోతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

మహేష్ బాబు కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు కదా. రాజమౌళి సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్తుందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.