|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్ బాబు సంచలనం: వ్యాపార విస్తరణలో దూకుడు! నెక్స్ట్ టార్గెట్ ఆ నగరాలేనా?

Published: 10-03-2026, 4:05 AM
మహేష్ బాబు సంచలనం: వ్యాపార విస్తరణలో దూకుడు! నెక్స్ట్ టార్గెట్ ఆ నగరాలేనా?
  • మహేష్ బాబు ‘ఏఎంబి సినిమాస్’ బ్రాండ్ ను దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నారు.
  • బెంగళూరులో 9 స్క్రీన్ లతో అత్యాధునిక మల్టీప్లెక్స్ ను మహేష్ ప్రారంభించారు.
  • విశాఖపట్నంలో మల్టీప్లెక్స్ నిర్మించాలని మహేష్ బాబు యోచిస్తున్నారు.
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి సినిమాలో నటిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన తన మల్టీప్లెక్స్ చైన్ ‘ఏఎంబి సినిమాస్’ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి సారించారు.

దేశవ్యాప్తంగా ఏఎంబి సినిమాస్ విస్తరణ

Maheshbabu: సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) వాలకం చూస్తుంటే.. ఇప్పుడు సినిమాలకంటే కూడా తన వ్యాపారాన్ని విస్తరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆయన దృష్టి పక్క నగరాలతో పాటూ రాష్ట్రాలపై పడడం అభిమానులలో మరింత అంచనాలను పెంచేసింది. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ.. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకుంటున్నారు మహేష్ బాబు. ఈ క్రమంలోనే ఆయన ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు మల్టీప్లెక్స్ థియేటర్ రంగంలో దూసుకుపోతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులో “ఏషియన్ సినిమాస్” తో కలిసి సంయుక్తంగా “ఏఎంబి సినిమాస్” ను నిర్మించిన మహేష్ బాబు.. ఇప్పుడు ఈ బ్రాండ్ ను దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే హైదరాబాదులో మొదలైన ఈ ఏఎంబి సినిమాస్ కాస్త రీసెంట్గా బెంగళూరులో ఏకంగా 9.స్క్రీన్ లతో అత్యధిక సదుపాయాలతో ఒక అద్భుతమైన మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆయన దృష్టి మిగతా నగరాలపై పడిందని సమాచారం. అందులో భాగంగానే ప్రస్తుతం విశాఖలో కూడా తన వ్యాపారాన్ని విస్తరింప చేయాలని మహేష్ బాబు చూస్తున్నారు.

విశాఖలో మహేష్ బాబు మల్టీప్లెక్స్

ఇకపోతే విశాఖలో మాత్రమే కాకుండా బెంగళూరు ఎయిర్ పోర్టు సమీపంలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడితో ఆగిపోకుండా కేరళ , తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలలో కూడా ఏఎంబి మల్టీప్లెక్స్ ను ఆయన ప్రారంభించాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే మొదట ఒక భారీ మల్టీప్లెక్స్ ను విశాఖపట్నంలో నిర్మించాలని ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అతిపెద్ద షాపింగ్ మాల్ తో పాటు మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభించారు. అక్కడ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇక అల్లు అర్జున్ బాటలోనే మహేష్ బాబు కూడా తన మల్టీప్లెక్స్ ను అక్కడ నిర్మించాలని చూస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ బాబు ఇప్పుడు ఒక వైపు సినిమాలు.. మరొకవైపు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ మరింత బిజీగా మారిపోయారని చెప్పాలి.

సినిమాలు, వ్యాపారంలో బిజీగా మహేష్

ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమాలో నటిస్తున్నారు. గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఆఫ్రికన్ అడవుల్లో సాగే ఈ కథ టైం ట్రావెల్ తో పాటు మైథలాజికల్ టచ్ కూడా ఇవ్వనున్నారు. ఇక భారీ అంచనాల మధ్య 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కుంభ అనే విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి వదులుతున్న చిన్న చిన్న అప్డేట్స్, చేపట్టిన ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై మరింత అంచనాలు పెంచేసాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ గుర్తింపును సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మహేష్ బాబు.

మొత్తానికి మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు తన వ్యాపార విస్తరణపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. ఇది ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.