|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బెంగళూరులో మహేష్ బాబు ఫ్యాన్స్ వీరంగం! లాఠీఛార్జ్!!

Published: 16-01-2026, 5:30 AM
షాకింగ్: బెంగళూరులో మహేష్ బాబు ఫ్యాన్స్ వీరంగం! లాఠీఛార్జ్!!
  • బెంగళూరులో మహేశ్ బాబు సందడి: AMB సినిమాస్ ప్రారంభోత్సవానికి భారీగా అభిమానులు!
  • సూపర్ స్టార్ రాకతో గాంధీనగర్‌లో తొక్కిసలాట, పరిస్థితి అదుపు చేయడానికి పోలీసుల లాఠీఛార్జ్!
  • మహేశ్ బాబు ట్వీట్: AMB సినిమాస్ టీమ్‌కు అభినందనలు, అభిమానులకు ధన్యవాదాలు!
  • బెంగళూరులో మహేశ్ బాబు క్రేజ్: సరిహద్దులు దాటిన టాలీవుడ్ సూపర్ స్టార్ ఫాలోయింగ్!

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. తాజాగా బెంగళూరులో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం.

బెంగళూరులో మహేశ్ బాబు సందడి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) క్రేజ్ సరిహద్దులు దాటింది. బెంగళూరులోని గాంధీనగర్‌లో కొత్తగా నిర్మించిన AMB సినిమాస్ (AMB Cinemas Kapali) మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు వెళ్లిన మహేశ్‌‌ను కనులారా చూసేంందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, మహేశ్ బాబు వస్తున్నారన్న సమాచారంతో మల్టీప్లెక్స్ పరిసరాల్లో భారీగా ఫ్యాన్స్ వేచి చూశారు. మహేశ్ కారు దిగగానే ఒక్కసారిగా అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. సూపర్ స్టార్.. సూపర్ స్టార్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. ఫ్యాన్స్ తోపులాట పెరగడంతో మహేశ్‌ను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చినట్లుగా సమాచారం.

ఈ సందర్భంగా మహేశ్ బాబు సోషల్ మీడియా (Social Media) ద్వారా స్పందిస్తూ.. నమ్మ బెంగళూరులో AMB సినిమాస్ తలుపులు తెరుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతటి అద్భుతమైన థియేటర్‌ను సిద్ధం చేసిన టీమ్ మొత్తానికి నా అభినందనలు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

ఫ్యాన్స్ తోపులాట, పోలీసుల లాఠీఛార్జ్

మహేశ్ బాబు ట్వీట్ వైరల్

మహేశ్ బాబు బెంగళూరు పర్యటన అభిమానులకు ఒక పండుగలా ఉంది. ఆయన రాకతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.