
మహేశ్ బాబు కొత్త చిత్రం ‘వారణాసి’ గ్రాండ్ లాంచ్ అయ్యింది. దీనితో పాటు మహేశ్ బాబు కారుపై ఉన్న చలాన్లను ఓ అభిమాని చెల్లించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఈ అనూహ్య అభిమానంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Key Points
మహేశ్ బాబు కొత్త చిత్రం 'వారణాసి' గ్రాండ్ లాంచ్ అయింది.
'వారణాసి' గ్లింప్స్ వీడియో విడుదల, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మహేశ్ కారుపై ఉన్న రూ.2070 విలువైన రెండు చలాన్లను ఓ అభిమాని చెల్లించాడు.
దర్శకుడు రాజమౌళి 'వారణాసి'లో మహేశ్ బాబు రాముడి పాత్రలో కనిపించనున్నట్లు ధృవీకరించారు.
మహేశ్ ‘వారణాసి’ లాంచ్, గ్లింప్స్ విడుదల
మహేశ్ బాబు హీరోగా కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగింది. ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు మూడున్నర నిమిషాల గ్లింప్స్ వీడియోని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు మహేశ్ ఫ్యాన్ చేసిన మరో పని కూడా చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ శివారులో జరిగిన ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ కోసం మహేశ్ కారులో వస్తున్న వీడియోని ఓ నెటిజన్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మహేశ్ కారు నంబర్‌తో చెక్ చేయగా.. రెండు చలాన్లు ఉన్నట్లు తేలింది. మహేశ్ బాబు లాంటి హీరో కారుపై చలాన్లు ఉండటంతో ఈ విషయం టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ అయింది. ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన ఓ అభిమాని.. మహేశ్ కారుపై చలాన్ల డబ్బుని కట్టేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అభిమాని షాకింగ్ నిర్ణయం: చలాన్లు చెల్లింపు
మహేశ్ బాబు వ్యక్తిగత కారుపై ఉన్న రూ.2070 చలాన్‌ని ఓ ఫ్యాన్ స్వయంగా చెల్లించడం చూసిన పలువురు నెటిజన్లు.. ఇదెక్కడి అభిమానం బాబోయ్ అని మాట్లాడుకుంటున్నారు.
రాజమౌళి వెల్లడించిన కీలక విషయాలు
‘వారణాసి’ సినిమా విషయానికొస్తే ఇందులో మహేశ్ బాబు, రాముడి పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. ఈ లుక్‌తో 60 రోజుల పాటు షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించాడు. మరోవైపు గ్లింప్స్ వీడియో బట్టి చూస్తే గతం నుంచి వర్తమానం, భవిష్యత్ కాలాలన్నింటిని మిక్స్ చేస్తూ ఫాంటసీ స్టోరీతీ దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2027 వేసవిలో రిలీజ్ కానుందని కీరవాణి చెప్పారు.
మహేశ్ ‘వారణాసి’ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా, అభిమాని చూపిన ఈ విచిత్రమైన ప్రేమ అతని స్టార్‌డమ్‌కు నిదర్శనం. ఇలాంటి సంఘటనలు సినీ అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతాయి.


